కాటేసిన కరెంట్ తీగలు | Katy current wires | Sakshi
Sakshi News home page

కాటేసిన కరెంట్ తీగలు

Published Mon, Oct 27 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

కాటేసిన కరెంట్ తీగలు

కాటేసిన కరెంట్ తీగలు

విద్యుత్ తీగలు ఇద్దరిని పొట్టన బెట్టుకున్నాయి.. వీరిలో ఒకరు యువరైతు, మరొకరు వాటర్‌మన్ ఉన్నారు.. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.. చేతికొచ్చిన కుమారుడు చనిపోయాడంటూ తల్లిదండ్రులు రోదించడం స్థానికులను కలచివేసింది.. హృదయ విదారకమైన ఈ సంఘటనల వివరాలిలా ఉన్నాయి.
 
 గట్టు / తిమ్మాజీపేట  :
 గట్టు మండలం ఆలూరుకు చెందిన కుమ్మరి కిష్టప్ప, మంగమ్మ దంపతులకు ము గ్గురు కుమారులు ఉన్నారు. వీరికి సమీపంలోనే ఐదెకరాల పొలం ఉంది. అందులో రెండు బో ర్లు వేసి వరి, పత్తి సాగు చే స్తున్నారు. పొలం దగ్గ రే గుడిసె వేసుకున్నారు. ఎప్పటిలాగే ఆది వారం ఉదయం అన్నదమ్ములు మహేష్ (20), రాజు, తండ్రి కిష్టప్పతో కలిసి బైక్‌పై తమ పొ లానికి వెళ్లారు. బోరు మోటార్ దగ్గర తండ్రి, త మ్ముడు దిగి పోగా, అన్న మాత్రం వాహనాన్ని కొద్దిదూరంలో ఉన్న గుడిసెలో పెట్టేందుకు వెళ్లాడు.

ఈ క్రమంలోనే దారిలో తెగి పడిన సర్వీస్ వైరును పక్కకు తీసి వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటికి వారొచ్చి చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటనతో కుటుంబం లో విషాదం నెలకొంది. మరో సంఘటనలో తిమ్మాజీపేట మండలం మరికల్‌కు చెందిన భ గవంతు (30) సమీపంలోని 220 కేవీ సబ్‌స్టేష న్ నిర్మాణ పనుల వద్ద ఏడాది కాలంగా వాటర్‌మన్‌గా పనిచేస్తున్నాడు.

ఈయనకు భార్య భూ దేవి, కుమారుడు ఉన్నారు. భార్య అక్కడే వం ట మనిషిగా పనిచేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ట్రాన్స్‌ఫార్మర్ మధ్యకు వెళ్లి అతను సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెం దాడు. అనంతరం బాధిత కుటుంబాన్ని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌గౌడ్ పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement