
'సాక్షి' కథనంపై స్పందించిన కేటీఆర్
హైదరాబాద్:భూగర్భ జలాల అంశానికి సంబంధించి సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. 'తెలంగాణ అంతటా.. పాతాళ గంటలు!' అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో మంగళవారం ఓ కథనం వచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. తక్షణ సాయం కింద రూ.263 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. తాగునీటి సమస్యలు రాకుండా 10 జిల్లాల్లో చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.