అమ్మవారి సేవలో మహిళా పూజారి | lady priest in amma varu in mahaboob nagar district | Sakshi
Sakshi News home page

అమ్మవారి సేవలో మహిళా పూజారి

Published Fri, Jun 12 2015 4:12 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

అమ్మవారి సేవలో మహిళా పూజారి

అమ్మవారి సేవలో మహిళా పూజారి

అలంపూర్‌: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కంచికామాక్షి అమ్మవారికి దశాబ్దాల కాలంగా వీరమ్మ అనే మహిళా పూజారి సేవలందిస్తున్నారు. సాధారణంగా ఆలయాల్లో పూజాదికాలు పురుష అర్చకులే నిర్వహిస్తుండడం తెలిసిందే. కానీ, ఇక్కడ మాత్రం వీరమ్మ ఆ అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. 'కామాక్షి అమ్మవారు తమ ఇలవేల్పు' అని వీరమ్మ అంటున్నారు. ఒకప్పుడు ఈ ఆలయాలు తమ ఆధీనంలో ఉండేవన్నారు. తమ ఆధీనంలోని 45 ఎకరాలను దేవాదాయ శాఖ తీసుకుని.. చాలీ చాలని వేతనం ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Advertisement
Advertisement