ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: దేశంలో ఔషధాల తయారీ రంగం ఎంతగానో విస్తరిస్తున్నదని, అయితే విద్యా సంస్థలు - కంపెనీల మధ్య అవగాహన లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఉద్యోగావకాశాలు వుండటం లేదని పలువురు ఫార్మారంగ నిపుణులు పేర్కొన్నారు. శేరిగూడ సమీపంలోని శ్రీఇందు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో శుక్రవారం ఁఫార్మా ఇగ్నైట్-14* నిర్వహించారు. కార్యక్రమానికి ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.ధర్మదాత, మెడిస్ ఫార్మసీ మేనేజింగ్ డెరైక్టర్ బి.డి.ఎల్.నాగేశ్వరరావు, నియోనాటల్ స్పెషలిస్ట్ డాక్టర్ శశి కుప్పల ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.
బీఫార్మసీ, ఫార్మాడీ, ఎమ్ ఫార్మసీ వంటి కోర్సులు అభ్యసించిన వారికి ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని వారన్నారు. ఫార్మా కోర్సులు అందజేస్తున్న విద్యాసంస్థలు ముందస్తుగా కంపెనీలతో అవగాహన ఏర్పర్చుకుంటే ఆశించిన స్థాయిలో విద్యార్థులకు ఉపాధి లభిస్తుందన్నారు. విద్యా సంస్థల ప్రతినిధులు, కంపెనీల నిర్వాహకులు ఈ విషయంపై దృష్టి సారించి యువతకు ఫార్మా విభాగంలో ఉజ్వల భవిష్యత్‌ను అందించాలని నిపుణులు సూచించారు. అనంతరం విద్యార్థులకు పలు అంశాల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఆర్.వెంకట్‌రావు, ప్రిన్సిపాల్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు అపారం
Published Fri, Mar 21 2014 11:27 PM | Last Updated on Fri, May 25 2018 2:34 PM
Advertisement