పట్వారీ పీఠానికి ఎసరు?!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పదవిపై టీఆర్‌ఎస్ కన్నేసింది. ప్రస్తుత అధ్యక్షుడు గంగాధర్ పట్వారీని గద్దె దింపేందుకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే ఆ యనపై అవిశ్వాసం పెట్టేం దుకు గు‘లాబీయింగ్’ చేస్తోంది. దానిని నె గ్గించడంతో పా టు టీఆర్‌ఎస్ నేతను ఆ పీఠంపై కూ ర్చుండబెట్టేందుకు ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
2013 ఫిబ్రవరిలో జరిగిన డీసీసీబీ ఎన్నికలలో నాలుగు డెరైక్టర్ స్థానాలను సాధించుకున్న టీఆర్‌ఎస్ క్రమంగా ఆ బ లాన్ని 12కు పెంచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చి,అవిశ్వాసం పెట్టేందుకు సరిపడే బలాన్ని రెండుమూడు రోజుల లో సమకూర్చుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. తటస్థులు, ఇత ర పార్టీల నుంచి బహిష్కరణకు గురైనవారు, ఊగిసలాటలో ఉన్న డెరైక్టర్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నంలో ఉంది. తాజాగా కాంగ్రెస్‌కు చెందిన భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి సింగిల్‌విండో అధ్యక్షుడు, డీసీసీబీ డైరక్టర్ ఎన్.చిన్నచంద్రారెడ్డి మరికొందరితో కలిసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను కలవడం విశేషం.
పరిస్థితులు అనుకూలించి
2013లో బోధన్ నుంచి గెలుపొందిన గంగాధర్ పట్వారీకి అప్పుడున్న రాజకీ య పరిస్థితులు పూర్తిగా అనుకూలిం చాయి. మెజార్టీ డెరైక్టర్ పదవులను దక్కించుకునేందుకు పార్టీలకతీతంగా టీడీపీ, కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డాయి. అప్పుడు మొత్తం 20 మంది డెరైక్టర్లకు 11 మంది కాంగ్రెస్, ఐదుగురు వైఎస్‌ఆర్ సీపీ, నలుగురు టీఆర్‌ఎస్‌కు చెందినవారు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గంగాధర్ పట్వారీ డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
2014లో సంభవించిన అనూ హ్య మార్పులనే పథ్యంలో టీఆర్‌ఎస్ బలం 12కు పెరిగింది. టీడీపీ, కాంగ్రెస్ నుంచి పలువురు డెరైక్టర్లు ఎమ్మెల్యేలతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరారు. అవిశ్వాసం పెట్టాలంటే రెండింట మూడు వంతుల మంది సభ్యుల మద్దతు కావాలి. అం దుకు సరిపడే విధంగా 15 మంది డెరైక్టర్లను కూడగట్టే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది.
రంగంలోకి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
సాధారణ ఎన్నికలలో భాగంగా టీఆర్‌ఎస్ రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. జిల్లా ప రిషత్ పీఠం, నిజామాబాద్ నగర కా ర్పొరేషన్ మేయర్ పదవితోపాటు, మె జార్టీ మున్సిపాలిటీలు, ఎంపీపీ, జడ్‌పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను సాధించుకుంది. ఇపుడు డీసీసీబీ కుర్చీపై దృష్టి పెట్టింది. త్వరలోనే గంగాధర్ పట్వారీపై అవిశ్వాసం మోపేందుకు సిద్ధమవుతోంది. పలువురు ఎమ్మెల్యేలు డీసీసీబీ డెరైక్టర్ల సమీకరణలో తమ శక్తియుక్తులను ఉపయోగిస్తున్నట్లు సమాచా రం.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పట్వారీ గం గాధర్ వెంట ఫతేపూర్ అధ్యక్షుడు గం గారెడ్డి అలియాస్ శ్రావణ్‌రెడ్డి, తాళ్లరాం పూర్ అధ్యక్షుడు చిన్న గంగారెడ్డి, బీబీ పేట ప్రేమయ్య, పుల్కల్‌కు చెందిన వెం కట్రాంరెడ్డి, డిచ్‌పల్లికి చెందిన గజవాడ జైపాల్ తదితరులున్నారు. ఎంపీపీ ఎ న్నికలలో టీఆర్‌ఎస్‌కు సహకరించారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన అమ్రాద్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు, రామేశ్వర్‌పల్లి అధ్యక్షుడు చిన్న చంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌కు చేరువయ్యారు.
అధికారికంగా ఈ ఇద్దరు టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రకటించకపోయినా, శ్రీనివాస్‌గౌడ్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. చంద్రారెడ్డి బుధవారం గంప గోవర్ధన్‌ను కలిసి మాట్లాడారు. మరో ఇద్దరు డెరైక్టర్లతో సైతం మంతనాలు జరిపిన టీఆర్‌ఎస్ సక్సెస్ అయినట్లు చెప్తున్నారు.