patwari
-
పట్వారీ కొలువుల కోసం 12 లక్షలకు పైగా దరఖాస్తులు
భోపాల్: పెరుగుతున్న జనాభా, కరోనా తర్వాతి పరిస్థితులు.. ఇలా పలు కారణాలతో దేశంలో నిరుద్యోగం రేటు పెరిగిపోతోంది. మరోవైపు పోటీ ప్రపంచంలోనూ తీవ్రత ఊహించని రీతిలోనే ఉంటోంది. తాజాగా పట్వారీ కొలువుల కోసం ఏకంగా 12 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లో ల్యాండ్ రెవెన్యూ అధికారుల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్. అటు ఇటుగా ఆరు వేల దాకా ఖాళీలను భర్తీ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే పోటీ ఎంతలా ఉందంటే.. ఏకంగా ఈ పోస్టుల కోసం పన్నెండున్నర లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీళ్లలో పీహెచ్డీ చేసిన వాళ్లతో పాటు ఇంజినీరింగ్ స్డూడెంట్స్, ఎంబీఏ చదివిన వాళ్లు సైతం ఉన్నారు. మొత్తం 12.79 లక్షల మంది అభ్యర్థులకుగానూ.. వెయ్యి మంది హీహెచ్డీ చేసిన వాళ్లు, 85 వేలమంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్, లక్ష దాకా ఎంబీఏ చేసిన వాళ్లు, మరో రెండు లక్షల మంది ఇతర డిగ్రీలు పూర్తి చేసిన వాళ్లు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగ శాతం 1.9 గా ఉందని ఈ జనవరిలో సీఎంఐఈ(సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) నివేదిక ఇచ్చింది. ఈ తరుణంలో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందన్న వాదనను తోసిపుచ్చుతున్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్తున్నారాయన. ఇదిలా ఉంటే.. తాజా నోటిఫికేషన్ అభ్యర్థుల గణాంకాలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఉద్యోగవకాశాలను కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. -
జైహింద్ స్పెషల్: బట్వాటా యోధుడు రంగారావు పట్వారీ
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో సంస్థానాధీశులు, రాజులు, వారి సైనికులు మాత్రమే కాదు.. అజ్ఞాతంగా చిన్న చిన్న జమిందార్లు, గ్రామాధికార్లయిన పట్వారీల వంటివారు కూడా కీలక పాత్ర పోషించారు. అటువంటి విస్మృత యోధులలో నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్‌ను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు పథక రచన చేసిన రంగారావు కూడా ఒకరు. తిరుగుబాట్ల రహస్య సమాచారం పొందుపరిచి ఉన్న లేఖలను నానా సాహెబ్‌కు, నిజాం పాలనలోని సమర యోధులకు చేర్చడానికి ఆయన అనేక కష్టాలు పడ్డారు. చివరికి బ్రిటిష్ సైనికుల చేతికి చిక్కారు. చదవండి: గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి చంద్రమౌళి చెక్ పవర్ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి దేశవ్యాప్తంగా మరాఠా పీష్వా బాలాజీ బాజీరావు (నానాసాహెబ్), చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా, ఆయన కుమారుడు మిర్జా మొగల్ తదితరులు నాయకత్వం వహిస్తున్న సమయంలో రంగారావు నిజాం ప్రాంతంలోని నార్కెట్ గ్రామ పట్వారిగా ఉన్నారు. రంగారావుతో పాటు కౌలాస్ జమిందార్ రాజా దీప్ సింగ్ (రాజా సాహెబ్), నిజాం ఆస్థానంలోని సఫ్దర్ ఉద్దౌలా మరికొంతమంది కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు వ్యూహ రచన చేస్తుండగా 1857 ఫిబ్రవరిలో రహస్య సమర యోధుడు, బ్రిటిష్ సైనిక ఉద్యోగి అయిన సోనాజీ పండిట్ నుండి పిలుపు రావడంతో రంగారావు ఆయన్ని కలిశారు. సోనాజీ పండిట్ ఆయనకు ఒక లేఖ ఇచ్చి నానా సాహెబ్‌కు అందజేయమని కోరారు. ఎక్కడో ఉత్తరభారతంలో ఉన్న నానా సాహెబ్ ను కలవడానికి బయలుదేరిన రంగారావు నర్మద, యమున నదులను దాటి లక్నో సమీపంలోని బెర్వతోడ గ్రామం వద్ద నానాసాహెబ్ కు తాను తీసుకు వచ్చిన ఉత్తరాన్ని అందజేశారు! ఆ లేఖ ద్వారా నిజాం రాజ్యంలోని బ్రిటిష్ పాలనా పరిస్థితులను అవగాహన చేసుకున్న నానాసాహెబ్... సొనాజీ పండిట్ లేఖకు సమాధానంగా... నిజాం రాజ్యంలో ఉన్న డఫేదారులు, జమిందార్లు, రోహిల్లాలు తిరుగుబాటు జెండా ఎగురవేసి సాధ్యమైనన్ని చోట్ల బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని కోరుతూ ఒక లేఖ రాసి దానిపై తన రాజ ముద్ర వేశారు. అలాగే సఫ్దర్ ఉద్దౌలా, రావు రంభా నింబాల్కర్, గులాబ్ ఖాన్, బుజురీలను ఉద్దేశించి విడివిడిగా రాసిన లేఖలను రంగారావుకు అందజేసి ఎవరి లేఖలు వారికి అందజేయాలని కోరారు. నిజామాబాద్‌లోని కౌలాస్ కోట: కౌలాస్ జమిందార్ రాజా దీప్ సింగ్ (రాజా సాహెబ్), మరికొందరు కలిసి బ్రటిషర్లపై తిరుగుబాటుకు వ్యూహరచన చేశారు. రంగారావు విస్మృత యోధుడిగా మిగిలిపోయినట్లే.. వ్యక్తిగా ఆయన రూపురేఖల్ని తెలిపే చిత్రాలు కూడా చరిత్రలో మిగలకుండా పోయాయి. తిరిగి వచ్చేలోగా..! రంగారావు ముందుగా ఔరంగాబాద్ చేరుకుని గులాం ఖాన్, బుజురీలను కలిసి వారి లేఖలను వారికి అందజేశారు. ఆ క్రమంలో కొండలు, నదీనదాలు, అడవులను అధిగమిస్తూ అలుపెరగని ప్రయాణం చేస్తున్న రంగారావును ఒకరోజు బందిపోటు దొంగలు చుట్టుముట్టారు. డబ్బు, ఆహార పదార్థాలతో పాటు ఆయన చేతిలో ఉన్న సఫ్దర్ ఉద్దౌలా, నింబాల్కర్‌లకు ఉద్దేశించిన లేఖలను కూడా దోచుకున్నారు. రంగారావు ధైర్యం వీడలేదు. సోనాజీ పండిట్ కి రాసిన లేఖ, మరో లేఖ తలపాగాలో దాచి ఉంచడం వల్ల వాటిని దొంగలపాలు కాకుండా రక్షించుకోగలిగారు. చివరికి అలసిసొలసి సోనాజీ పండిట్ ఉండే గ్రామానికి తిరిగివచ్చిన రంగారావుకు సోనాజీ మరణించాడనే వార్త తెలిసి ఖిన్నుడయ్యాడు. ఆ ఘటనతో రంగారావు తనే స్వయంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఉద్యమ నాయకత్వాన్ని భుజానికెత్తుకుని హైదరాబాద్ వైపు కదిలారు. తన ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా ఎంతో మందిని కలిసి మద్దతు పొందడానికి ప్రయత్నించారు. వెళ్లే మార్గంలో మాదాపూర్ గ్రామ నాయక్‌కు, తర్వాత హల్లి గ్రామానికి వెళ్లి బాబూ పటేల్‌కు, ఆ తర్వాత చక్లి గ్రామం చేరి అధికారిని కలిసి సోనాజీకి నానాసాహెబ్ రాసిన లేఖ చూపించారు. అయితే ఎవరూ ఆయనకు సహాయం చేయలేదు. దీంతో హైదరాబాద్ వెళ్లకుండా నిజామాబాద్ జిల్లాలో ఉన్న కౌలాస్ చేరారు. అక్కడే కొంతకాలం గడిపారు. ఈ కాలంలో నాలుగుసార్లు కౌలాస్ రాజాతో చర్చలు జరిపారు. ఇక్కడ ఉండటం ఎవరికీ శ్రేయస్కరం కాదని, కాబట్టి మకాం మార్చమని రాజా సాహెబ్ చెప్పడంతో నీలేకర్ గ్రామం చేరి రఘునాథ్ పజ్జీ దగ్గర రెండువారాలు ఆశ్రయం పొందారు. అయితే రఘునాథ్.. తిరుగుబాటుకు సంబంధించి ఎటువంటి సహాయం అందించడానికి నిరాకరించడమే కాక సొంత ఊరికి పోయి హాయిగా శేష జీవితం గడపమని రంగారావుకు సలహా ఇచ్చాడు. పట్టువదలని విక్రమార్కుడిలా రంగారావు మాణిక్ నగర్ వైపు నడిచి మాణిక్ ప్రభుని కలిసి తన కథను వినిపించారు. ప్రభు వద్ద ఎనిమిది రోజులు గడిపి, అతడి ఆశీస్సులతో నీలేకర్ గ్రామానికి వెళ్లి బడే అలీని కలిశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలలో తిరుగుబాటు వచ్చినప్పుడు తాను తప్పకుండా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కనిపెట్టిన బ్రిటిషర్లు! ఈ పరిస్థితుల్లో స్వగ్రామం వైపు బయల్దేరిన రంగారావు మార్గమధ్యంలో బ్రిటిష్ సైన్యానికి చిక్కాడు. 1859, ఏప్రిల్12 న ‘ఇంగ్లిష్మెన్’ అనే ఆంగ్లపత్రికలో ఆయన ఆరెస్టు వార్త వచ్చింది. బ్రిటిష్ సైన్యం రంగారావుతో పాటు కౌలాస్ రాజా దీప్ సింగ్, సఫ్దరుద్దౌలాలను, వారి అనుచరులను అరెస్టు చేసింది. రాజా దీప్ సింగ్ కు మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. జాగీరును కూడా స్వాధీనం చేసుకుంది. తర్వాత ఆ జాగీర్ ను ఆయన కుమారునికి ఇచ్చింది. సఫ్దరుద్దౌలాను పదవి నుంచి తొలగించి అతడి స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని జీవిత ఖైదు విధించారు. రంగారావుకు మరణశిక్ష విధించినా... తరువాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చి అండమాన్‌కు పంపారు. ఆయన 1860 సంవత్సరంలో అక్కడే చనిపోయారు. – జి. శివరామకృష్ణయ్య -
డీఎస్ఎస్ఎస్బీలో 7236 ఉద్యోగాలు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(ఎన్సీటీ ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్ఎస్ఎస్బీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 7236 ► పోస్టుల వివరాలు: ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)–6258, అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ, నర్సరీ)–628, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్–278, కౌన్సిలర్–50, పట్వారీ–10. ► ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): సబ్జెక్టులు: హిందీ, నేచురల్ సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, బెంగాలీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఏ(ఆనర్స్), బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వయసు: 32 ఏళ్లు మించకూడదు. ► అసిస్టెంట్ టీచర్(ప్రైమరీ, నర్సరీ): అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: అర్హత: మెట్రిక్యులేషన్/సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి. వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ► కౌన్సిలర్: అర్హత: సైకాలజీ/అప్లైడ్ సైకాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కౌన్సిలింగ్ సైకాలజీలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి. ► పట్వారీ: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీతో పాటు ఉర్దూ /హిందీలో పని అనుభవం ఉండాలి. వయసు: 21–27 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: వన్ టైర్/టూ టైర్ ఎగ్జామినేషన్ స్కీమ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 25.05.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021 ► వెబ్సైట్: dsssb.delhi.gov.in మరిన్ని నోటిఫికేషన్లు: ఐఐఐటీ శ్రీసిటీలో టీచింగ్ కొలువులు సీడ్యాక్, హైదరాబాద్‌లో 44 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు -
పట్వారీ పీఠానికి ఎసరు?!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పదవిపై టీఆర్ఎస్ కన్నేసింది. ప్రస్తుత అధ్యక్షుడు గంగాధర్ పట్వారీని గద్దె దింపేందుకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే ఆ యనపై అవిశ్వాసం పెట్టేం దుకు గు‘లాబీయింగ్’ చేస్తోంది. దానిని నె గ్గించడంతో పా టు టీఆర్ఎస్ నేతను ఆ పీఠంపై కూ ర్చుండబెట్టేందుకు ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2013 ఫిబ్రవరిలో జరిగిన డీసీసీబీ ఎన్నికలలో నాలుగు డెరైక్టర్ స్థానాలను సాధించుకున్న టీఆర్ఎస్ క్రమంగా ఆ బ లాన్ని 12కు పెంచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చి,అవిశ్వాసం పెట్టేందుకు సరిపడే బలాన్ని రెండుమూడు రోజుల లో సమకూర్చుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. తటస్థులు, ఇత ర పార్టీల నుంచి బహిష్కరణకు గురైనవారు, ఊగిసలాటలో ఉన్న డెరైక్టర్లను టీఆర్ఎస్లో చేర్చుకునే ప్రయత్నంలో ఉంది. తాజాగా కాంగ్రెస్‌కు చెందిన భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి సింగిల్‌విండో అధ్యక్షుడు, డీసీసీబీ డైరక్టర్ ఎన్.చిన్నచంద్రారెడ్డి మరికొందరితో కలిసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను కలవడం విశేషం. పరిస్థితులు అనుకూలించి 2013లో బోధన్ నుంచి గెలుపొందిన గంగాధర్ పట్వారీకి అప్పుడున్న రాజకీ య పరిస్థితులు పూర్తిగా అనుకూలిం చాయి. మెజార్టీ డెరైక్టర్ పదవులను దక్కించుకునేందుకు పార్టీలకతీతంగా టీడీపీ, కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డాయి. అప్పుడు మొత్తం 20 మంది డెరైక్టర్లకు 11 మంది కాంగ్రెస్, ఐదుగురు వైఎస్ఆర్ సీపీ, నలుగురు టీఆర్ఎస్కు చెందినవారు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గంగాధర్ పట్వారీ డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2014లో సంభవించిన అనూ హ్య మార్పులనే పథ్యంలో టీఆర్ఎస్ బలం 12కు పెరిగింది. టీడీపీ, కాంగ్రెస్ నుంచి పలువురు డెరైక్టర్లు ఎమ్మెల్యేలతోపాటు టీఆర్ఎస్లో చేరారు. అవిశ్వాసం పెట్టాలంటే రెండింట మూడు వంతుల మంది సభ్యుల మద్దతు కావాలి. అం దుకు సరిపడే విధంగా 15 మంది డెరైక్టర్లను కూడగట్టే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది. రంగంలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాధారణ ఎన్నికలలో భాగంగా టీఆర్ఎస్ రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. జిల్లా ప రిషత్ పీఠం, నిజామాబాద్ నగర కా ర్పొరేషన్ మేయర్ పదవితోపాటు, మె జార్టీ మున్సిపాలిటీలు, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను సాధించుకుంది. ఇపుడు డీసీసీబీ కుర్చీపై దృష్టి పెట్టింది. త్వరలోనే గంగాధర్ పట్వారీపై అవిశ్వాసం మోపేందుకు సిద్ధమవుతోంది. పలువురు ఎమ్మెల్యేలు డీసీసీబీ డెరైక్టర్ల సమీకరణలో తమ శక్తియుక్తులను ఉపయోగిస్తున్నట్లు సమాచా రం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పట్వారీ గం గాధర్ వెంట ఫతేపూర్ అధ్యక్షుడు గం గారెడ్డి అలియాస్ శ్రావణ్‌రెడ్డి, తాళ్లరాం పూర్ అధ్యక్షుడు చిన్న గంగారెడ్డి, బీబీ పేట ప్రేమయ్య, పుల్కల్కు చెందిన వెం కట్రాంరెడ్డి, డిచ్పల్లికి చెందిన గజవాడ జైపాల్ తదితరులున్నారు. ఎంపీపీ ఎ న్నికలలో టీఆర్ఎస్కు సహకరించారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన అమ్రాద్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు, రామేశ్వర్‌పల్లి అధ్యక్షుడు చిన్న చంద్రారెడ్డి టీఆర్ఎస్కు చేరువయ్యారు. అధికారికంగా ఈ ఇద్దరు టీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించకపోయినా, శ్రీనివాస్‌గౌడ్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రెస్మీట్లో పాల్గొన్నారు. చంద్రారెడ్డి బుధవారం గంప గోవర్ధన్‌ను కలిసి మాట్లాడారు. మరో ఇద్దరు డెరైక్టర్లతో సైతం మంతనాలు జరిపిన టీఆర్ఎస్ సక్సెస్ అయినట్లు చెప్తున్నారు.