కొర్విపల్లి వద్ద ఎండలో డ్యూటీ చేస్తున్న పీసీ
చిన్నశంకరంపేట(మెదక్) : ఈ నెల 9న సీఎం కేసీఆర్ మెదక్ పట్టణానికి వస్తుండడంతో ఐదు రోజుల ముందు నుంచి పోలీస్‌లు బీట్ డ్యూటీ చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ మెదక్ నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు మెదక్–చేగుంట రహదారిపై వాహనంలో బయలుదేరనున్నారు. దీంతో ఈ రోడ్డుపై పోలీస్ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ముందు జాగ్రత్తగా మెదక్–చేగుంట రహదారిపై ఉన్న బ్రిడ్జిల వద్ద ఇద్దరేసి పోలీస్‌లు వంతుల వారిగా 24 గంటలు బీట్ డ్యూటీ చేస్తున్నారు. చిన్నశంకరంపేట నుంచి టి.మాందాపూర్ వరకు అనేక చోట్ల బ్రిడ్జిల వద్ద పోలీస్ కాపాల ఏర్పాటు చేశారు.అసలే ఎండాకాలం...అసలే ఎండకాలం ఎర్రటి ఎండ...మరో వైపు మెదక్ రోడ్‌పై ఎక్కడా పచ్చని చెట్టు నీడ కూడలేదు.
దీంతో వేసవి సూర్య ప్రతాపం 43 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య బీట్ డ్యూటీ చేస్తున్న పీసీలకు పొగలుకక్కుతున్న బీటీ రోడ్డు సెగలు కూడా తోడయ్యయి. వేసవి తాపంతో తాగేందుకు తెచ్చుకున్న చల్లటి నీరు సైతం ఎండకు వేడేక్కి దహంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment