ఘనంగా కార్గిల్ దివస్ | Richly Kargil Diwas | Sakshi
Sakshi News home page

ఘనంగా కార్గిల్ దివస్

Published Sun, Jul 27 2014 12:02 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

Richly Kargil Diwas

తాండూరు టౌన్ : పట్టణ శివారులోని బాలికల గురుకుల పాఠశాల (ఏపీఆర్‌ఎస్) విద్యార్థినులు శనివారం ఘనంగా కార్గిల్ దివస్‌ను నిర్వహించారు. విద్యార్థినులు సైనిక దుస్తుల్లో జాతీయ జెండాను చేతపట్టుకుని విజయోత్సాహంతో పరుగులు తీశారు. పలు విన్యాసాలను ప్రదర్శించి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కార్గిల్ ప్రాంతంలో జరిగిన పోరాటంలో మన దేశ సైనికులు విజయబావుటా ఎగురవేశారన్నారు.

నాటి యుద్ధంలో మరణించిన వీరులకు జోహార్లు అర్పిస్తూ ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ దివస్‌ను జరుపుకుంటామన్నారు. దేశ సేవకు మించిన కార్యం ఏదీ లేదని, యువత సైన్యంలో చేరి దేశ రక్షణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంబాపూర్ ఎస్‌ఎంసీ చైర్మన్ వెంకటయ్య, ఉపాధ్యాయులు రాజేశ్వరి, బాలకృష్ణ, శ్రీధర్, రఘు  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement