ఖమ్మంలో 'రన్‌ఫర్ లకారం' | 'run for lakaram pond' program in khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో 'రన్‌ఫర్ లకారం'

Published Sun, Apr 26 2015 8:43 AM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

'run for lakaram pond' program in khammam

ఖమ్మం : ఖమ్మం నగరంలోని లకారం చెరువు పరిరక్షణ కోసం 'రన్‌ఫర్ లకారం' కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. మిషన్ కాకతీయలో భాగంగా రూ.8 కోట్ల ఖర్చుతో చేపట్టే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లకారం చెరువును నగర తాగునీటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అదేవిధంగా పర్యాటక పరంగా అభివృద్ధి చెందేందుకు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పి. అజయ్‌కుమార్, జడ్పీ చైర్ పర్సన్ కవిత, కలెక్టర్ ఇలంబరిది మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement