క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించాలి | Skills in sports | Sakshi
Sakshi News home page

క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించాలి

Published Fri, Jun 2 2017 1:36 AM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

Skills in sports

జగిత్యాల రూరల్‌: క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి శ్యామ్‌ప్రకాశ్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి మినీస్టేడియంలో నిర్వహించిన బాస్కెట్‌బాల్, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులు విద్యతో పాటు క్రీడలపైనా శ్రద్ధ పెంచుకోవాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు క్రీడాకారులు వ్యక్తిగత నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పేట అధ్యక్షుడు విశ్వప్రసాద్, కార్యదర్శి అశోక్, పీఈటీలు కృష్ణప్రసాద్, అజయ్‌బాబు, కోటేశ్వర్‌రావు, వేణు, సాగర్, భాస్కర్‌రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement