ఏసీఎస్‌వోలను డీసీఎస్‌వోలుగా అప్‌గ్రేడ్‌ చేయాలి | Telangana Gazetted Officers asks CV anand for promotions | Sakshi
Sakshi News home page

ఏసీఎస్‌వోలను డీసీఎస్‌వోలుగా అప్‌గ్రేడ్‌ చేయాలి

Published Sun, Aug 20 2017 3:07 AM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM

Telangana Gazetted Officers asks CV anand for promotions

  • సీవీ ఆనంద్‌కు టీజీవోల సంఘం విజ్ఞప్తి  
  • సాక్షి, హైదరాబాద్‌: పౌరసరఫరాల శాఖలో ఏసీఎస్‌వోలుగా పనిచేస్తున్న అధికారులను డీసీఎస్‌వోలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్ల సంఘం ఆ శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం వద్ద సుదీర్ఘ కాలంగా పెండిం గ్‌లో ఉన్న డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్న తులు కల్పించాలని సంఘం కోరింది.

    కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల నుంచి పురస్కారాలు లభించిన నేపథ్యంలో శనివారం ఆయన్ను కలసిన టీజీవోల సంఘం నేతలు అభినం దనలు తెలిపారు. అప్‌గ్రేడ్‌ అంశం  పరిశీలనలో ఉందని కమిషనర్‌ వారికి వివ రించారు. టీజీవో నగర అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, ఉపాధ్యక్షుడు ఎండీ అబ్దుల్‌ ఖదీర్, మరో ఆరుగురు ప్రతినిధులు ఆయన్ను కలసిన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement