సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి దాదాపు రూ. కోటితో కొత్తగా నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ హెచ్చరికల మేరకు నిఘా వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ. 99.50 లక్షలు కేటాయిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడున్న సీసీ కెమెరాలు, సీసీ టీవీ వ్యవస్థకు బదులుగా సచివాలయం చుట్టూ ఉన్న కంచెకు అక్కడక్కడ ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) కెమెరాలను అమర్చనున్నారు. ప్యాన్ టిల్ట్ జూమ్ కెమెరాల ద్వారా 24 గంటల పాటు నిఘా ఏర్పాటు చేస్తారు. సీఎం ఉంటున్న సి-బ్లాక్‌లోనూ ఐఆర్ కెమెరాలను అమర్చాలని నిర్ణయించింది.