శంషాబాద్: శంషాబాద్ పట్టణంలో కిడ్నాప్ కలకలం రేగింది. అప్పు తీసుకుని తిరిగి చెల్లించడంలో ఆలస్యమైన వ్యక్తితో మాట్లాడడానికి తీసుకుపోవడంతో ఆందోళన చెందిన భార్య తన భర్తను కిడ్నాప్ చేశారంటూ సోమవారం సాయంత్రం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ప్రాంతానికి చెందిన బురాన్(55) పట్టణంలోని మధురానగర్ కాలనీలో వాచ్‌మన్‌గా పనిచేస్తూ తన భార్య నర్సమ్మతో కలిసి ఉంటున్నాడు.
దేవరకద్ర గ్రామానికి చెందిన జయమ్మ వద్ద వీరు రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నారు. ఇటీవల అప్పును తిరిగి చెల్లించకపోవడంతో జయమ్మ మరో నలుగురు వ్యక్తులతో కలిసి అప్పు విషయమై మాట్లాడడానికి కారులో బురాన్‌ను తీసుకుని వెళ్లింది. ఆందోళనకు గురైన అతడి భార్య తన భర్తను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు గంటల తర్వాత బురాన్ ఇంటికి చేరుకోవడంతో కథ సుఖాంతమైంది.
శంషాబాద్‌లో కిడ్నాప్ కలకలం
Published Tue, Jun 7 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM
Advertisement
Advertisement