ఏరువాక సాగేనా... అన్నో రైతన్నా! | Thousands of farmers persistent eyes ...! | Sakshi
Sakshi News home page

ఏరువాక సాగేనా... అన్నో రైతన్నా!

Published Fri, Jun 13 2014 3:55 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఏరువాక సాగేనా... అన్నో రైతన్నా! - Sakshi

ఏరువాక సాగేనా... అన్నో రైతన్నా!

నేడు ప్రత్యేక పూజలు
 మహబూబ్‌నగర్ కల్చరల్: ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట తిరుమలనాథస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రాంమోహనాచార్యులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు శ్రీవారికి అభిషేకం, అనంతరం సహస్రపుష్పార్చన, 10 గంటలకు సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తామని, జిల్లాలోని భక్తులు ఈ విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని కోరారు.   
 
 నేల తల్లిని నమ్ముకుని జిల్లాలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. నాగళ్లు, ఇతర పరికరాలు, విత్తనాలు సిద్ధం చేసుకునేందుకు రైతన్నలను ఏరువాక పౌర్ణమి మేల్కొలుపుతుంది. జిల్లాలోని అలంపూర్, గద్వాల, మక్తల్, కొడంగల్, నారాయణపేట తదితర ప్రాంతాల్లో ఈ పండుగకు ప్రత్యేకత ఉంది. పశువులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయం చుట్టూ తిప్పించి, వాటికి ఇంట్లో చేసిన పిండి పదార్థలను తినిపించి, సాగుకు సిద్ధం చేశారు. ‘ఏరువాక సాగేనో రన్నో చిన్నన్న...నీ కష్టమంతా తీరునురో అన్నో రైతన్న’ అంటూ రైతన్న హాయిగా పాటలు పాడుకుంటూ సేద్యం చేసే రోజులు కావివి. విత్తనాలు మొదలుకుని పంటచేతికొచ్చే వరకు కష్టాలు, పడిగాపులు తప్పడం లేదు.  
 
 గట్టు/బొంరాస్‌పేట/ మరికల్: ముంగారి సేద్యానికి ముందు వచ్చే రైతుల పండుగ ఏరువాక. సేద్యంలో చేదోడు వాదోడుగా ఉండే కాడెద్దులను ఏరువాక సందర్భంగా శుక్రవారం రైతులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సాయంత్రం గ్రామంలో పుర వీధుల గుండా డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. గడిచిన మూడేళ్ల కాలంలో వరుసగా కరువు రైతులను కోలుకోకుండా చేసి ంది. గతేడాది కరువు రాక పోయినా ఖరీఫ్‌తో పాటు రబీ పంటల దిగుబడి పూర్తిగా తగ్గడం తో పాటు గిట్టుబాటు ధర రాక అన్నదాతలు తల్లడిల్లిపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏ డాదైనా ఏరువాక సాఫీగా సాగేనా అనే సందేహం ఉంది. ఇప్పటి వరకు చీనుకు జాడలేకుం డా పోవడమే రైతులను తీవ్రంగా కలచి వేస్తోంది. రోహిణి కార్తె వచ్చినా ఇప్పటి దాకా ఆశించిన స్థాయిలో ఒక్క వర్షం కూడా పండలేదు.
 
 గ్రామ దేవతలకు పూజలు.....
 ఏరువాక పండుగ సందర్భంగా గ్రామాల్లో మారెమ్మ, సుంకులమ్మ, కొర్వ ంజమ్మ, సవారమ్మ, సుంకులమ్మ, దేవమ్మ, కాళీకాదేవీ ఇలా గ్రామ దేవతల కు రైతులు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్ర త్యేక వంటకాలు తయారు చేసి నైవేద్య ంగా సమర్పిస్తారు. పొలాలను దుక్కి దు న్ని విత్తనాలు వేసేందుకు సిద్ధం చేస్తారు. అయితే ఈ ఏడాది కొందరు రైతులు పౌర్ణమికి ముందే విత్తనాలు వేశారు.    
 
 ఏరు ముందా..ఏరువాక ముందా?
 ఏరు ముందా... ఏరువాక ముందా అనేది నానుడి ఉంది. అంటే ఈ రెండు ఒకదానికొకటి పోటీ పడుతూ వస్తుంటాయని పెద్దలు చెబుతుంటారు. నైరుతి రుతుపవనాలు రాష్ర్టంలోకి ప్రవేశించిన తరుణంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు. ఇదే సమయంలో కర్ణాటకలో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు కురిసి నదీ ప్రవాహం వస్తుంది. ఆ రెండింటిలో ఏది ముందు వచ్చినా రైతులు సంతోషిస్తారు. అందుకే ఏరు ముందా....ఏరువాక ముందా అనే నానుడి వచ్చింది. అయితే ఈ ఏడాది ఏరు(నదీ ప్రవాహం)కంటే ఏరువాక పౌర్ణమే ముందుగా వచ్చింది.  
 
 ఒన్నంగి.. ఏరువాక తోరణం
 పాడిపంటలతో పచ్చగా తుల తూగాలని ప్రతి ఇంటికి పచ్చతోరణం (ఒన్నంగి) పెట్టడం గ్రామాల్లో అనాధిగా వస్తున్న సంప్రదాయం. బంటు, నెల్లి, తలారి కులాలకు చెందిన వారు రేల కొమ్మలను ఇంటికి తోరణాలకు అలంకరించి ఇంటి యజమానులు ఇచ్చే ధాన్యం, ఇతర సరుకులు తీసుకెళ్తారు. ఈ సంప్రదాయాన్ని కొన్ని గ్రామాల్లో మరిచిపోయినప్పటికీ ఏరువాక పండుగను పురస్కరించుకొని మూడు రోజుల ముందు నుంచి ‘ఒన్నంగి’ పెడుతున్నారు.
 
 మరికల్‌లో సంబరాలు
 పుష్కలమైన వర్షాలు కురిసి సమృద్ధిగా పాడిపంటలు పండాలని కోరుకుంటూ రైతన్నలు గురువారం మరికల్‌లో ఘన ంగా ఏరువాక పౌర్ణమి సంబరాలను నిర్వహించారు. ఎద్దులకు స్నానాలు చేయించి వాటిపై రంగులతో ప్రధాని మోడీ, తెలంగాణ చిత్రాలు వేశారు. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఏరువాక తాడును తెంపేందుకు సంప్రదాయ పద్ధతి ప్రకారం రైతులు ఎద్దులను ఆ తాడు కింద పరుగులు పెట్టించారు. అనంతరం దొరల ఎ ద్దును తిప్పిన వ్యక్తి ఏరువాక తాడును తెప్పగ, ఆ తాడులో ఉన్న కొబ్బెర కోసం యువకులు పోటీపడి దక్కించుకున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు.  
 
 వర్షాలు పడితే చాలు పుడమి పులకరిస్తుంది. ఏటా జరిగే ఈ ప్రకృతి ధర్మం రైతన్నలకు ఎంతో మనోధైర్యాన్నిస్తుంది. వర్షాకాలంలో తొలకరి వర్షాలు కురిస్తే భూమిలోని గింజలు ఎంతో ఆశతో పైన కప్పుకొన్న మట్టిని తొలగించుకుంటూ మొలకెత్తుతాయి. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఈ మొక్కలు పెరిగి పెద్దవై అన్నదాతలను ఆదుకుంటాయి. ఇటీవల కురిసిన తొలకరి చిరుజల్లులకు దేవరకద్ర-మహబూబ్‌నగర్ మార్గమధ్యలోని కోడూరు సమీపంలో గతంలో పంట పండినప్పుడు ఓ పొలంలో పడ్డ కొన్ని వేరుశనగ గింజలు పుడమి నుంచి ప్రాణం పోసుకొని మొలకెత్తిన దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.                                             - దేవరకద్ర రూరల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement