గట్టు (గద్వాల) :ఈ తండ్రీకూతుళ్లు తమ రెక్కల కష్టాన్నే నమ్ముకున్నారు. వ్యవసాయ పనుల్లో భాగంగా మండలంలోని యల్లందొడ్డి శివారులో తండ్రి శ్రీనివాసులు కాడెద్దుగా మారితే.. కూతురు అమృత గుంటికెను పట్టుకుని పత్తి పొలంలో కలుపు నివారణ చర్యలు చేపట్టారు.
నాగలి పట్టి.. విత్తనాలు వేసి..
కోవిడ్–19 నేపథ్యంలో ఎక్కడా పశువుల సంతలు నిర్వహించడం లేదు. దీంతో పొలంలో విత్తనాలు వేయడానికి రైతులకు ఎద్దుల గడాలు దొరకడం లేదు. చేసేదీమీ లేక కొన్నిచోట్ల వారే స్వయంగా విత్తుకుంటున్నారు. ఇలా మండలంలోని కొత్తపల్లికి చెందిన భార్యాభర్తలు పద్మమ్మ, వెంకట్‌రెడ్డి కలిసి తమకున్న కొద్దిపాటి పొలంలో నాగలితో దున్ని కంది విత్తనాలు వేశారు. – మద్దూరు
Comments
Please login to add a commentAdd a comment