తాండూరు: పాతతాండూరుకు చెందిన జి.విజయనిర్మల జాతీయ ఉత్తమ మహిళా రైతు పురస్కారాన్ని అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌లో ‘జాతీయ మహిళా రైతు’ దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ స్థాయిలో వ్యవసాయంలో అత్యంత ప్రతిభను కనబరిచిన దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 250 మంది మహిళా రైతులు జాతీయ ఉత్తమ రైతు అవార్డులకు ఎంపికయ్యారు.
ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు మహిళా రైతులు ఎంపిక కాగా.. వీరిలో తాండూరుకు చెందిన జి.విజయనిర్మల ఒకరు. ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ విలియం డి.డార్ చేతుల మీదుగా విజయనిర్మలతోపాటు మిగతా ఉత్తమ రైతు అవార్డు గ్రహీతలకు సన్మానం, స్వర్ణపతకాలను అందజేశారు. ఇక్రిశాట్ తయారు చేసిన కంది, జొన్న, వేరుశనగ, సజ్జ, పప్పు శనగ పంటల్లోని వంగడాలు ఆధునిక సాగు పద్ధతులు ఆచరించి ఆయా పంటల్లో అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలిచిన మహిళా రైతులను ఇక్రిశాట్ జాతీయ ఉత్తమ రైతు అవార్డుకు ఎంపిక చేసింది. కార్యక్రమంలో ఇక్రిశాట్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డా.సీఎల్‌ఎల్.గౌడ, స్ట్రాటెజిక్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ డెరైక్టర్ డా.జోవాన్న కేన్, పొటాక్, ఇక్రిశాట్ డెవలప్‌మెంట్ సెంటర్ డెరైక్టర్ డా.సుహా స్ పి.వాణి, వివిధ రాష్ట్రాల వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఇదీ.. విజయ ప్రతిభ
ఇక్రిశాట్ కంది పరిశోధనా విభాగం అధిపతి, సీనియ ర్ శాస్త్రవేత్త డా.సి.సమీర్‌కుమార్, తాం డూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తల సహకారంతో కంది పంట లో నూతన రకాలను సాగుచేస్తూ, ఆధునిక పద్ధతులను ఆచరిస్తూ విజయనిర్మ ల అధిక దిగుబడులు సాధిస్తున్నారు. 2012-13 సంవత్సరంలో మొదటిసారిగా ఇక్రిశాట్ రూపొందించిన ఐసీపీహెచ్-2740 కందిరకం సాగుచేసి అధిక దిగుబడులు సాధించారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా నాటే పద్ధతిలో కంది పంటను డ్రిప్పు కింద సాగు చేయడమే కాకుండా అంత ర్ పంటగా బెండ పంటను విత్తారు. రసాయనిక ఎరువులు, పురుగు మందు ల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువు ల వాడకంపై ఆమె కనబర్చిన ఆసక్తి ఇక్రిశాట్ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించిం ది. విజయనిర్మలను జాతీయస్థాయి ఉత్తమ రైతు అవార్డు వరించింది. ఈ అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని విజయనిర్మల పేర్కొన్నారు. తాండూరుకు చెందిన మహిళకు జాతీయ స్థాయి అవార్డు రావడం పై తాండూరు పరిశోధనా కేంద్రం హెడ్ శాస్త్రవేత్త డా.సి.సుధారాణి, సీనియర్ శాస్త్రవేత్త డా.సి.సుధాకర్‌లు విజయనిర్మలకు అభినందనలు తెలిపారు.
‘విజయ’ పతాక!
Published Fri, Sep 12 2014 11:52 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement