వాచ్‌మన్ దారుణ హత్య | watch men murdered in nagole | Sakshi
Sakshi News home page

వాచ్‌మన్ దారుణ హత్య

Published Sat, Jan 17 2015 3:38 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

watch men murdered in nagole

నాగోల్: కోరుకుంట్ల ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే నావెల్ కిషోర్ సింగ్(55) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై రాడ్‌తో బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

బీహార్‌కు చెందిన కిషోర్ సింగ్ కొన్ని సంవత్సరాలుగా కాలేజీలో వాచ్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. హత్య జరిగిన వాచ్‌మన్ గదిలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్య తెలిసిన వాళ్లే చేసుంటారా? లేక ఇతరులతో పాతగొడవల వల్ల జరిగిందా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Advertisement

పోల్

Advertisement