లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన లోని నగర పాలిక కౌన్సిలర్ రామ్‌కుమార్ చౌహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత మరో వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. గుర్తు తెలియని వ్యక్తి అర్జున్ అర్జున్ కుమార్ అనే పేరు మీదున్న ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో ఓ మోడల్‌తో యోగి ఉన్నట్టుగా మార్ఫింగ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేశాడు. ఘజియాబాద్‌కు చెందిన ముఖేష్ మిట్టల్ అనే వ్యక్తి ఈ ఫొటోలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
'సోషల్ మీడియాలో యోగి మార్ఫింగ్ ఫొటోలను పోస్ట్ చేయడంపై ఫిర్యాదు చేయగా పోలీసు స్టేషన్ ఇంఛార్జి ఆఫీసర్ కేసు నమోదు చేసేందుకు సందేహించారు. ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం కావడంతో సీనియర్ అధికారులను కలవాల్సిందిగా సూచించారు. ఘజియాబాద్ సీనియర్ ఎస్పీ దీపక్ కుమార్‌ను కలసి విషయం చెప్పగా, ఆయన వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు' అని మిట్టల్ చెప్పారు. దర్యాప్తు చేసి, నిందితుడిని గుర్తించాల్సిందిగా క్రైం బ్రాంచ్ అధికారులను దీపక్ కుమార్ ఆదేశించారు. గత మార్చిలో గ్రేటర్ నోయిడాలో రహత్ ఖాన్ అనే యువకుడిని యోగిపై అభ్యంతకర పోస్ట్ చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.
సీఎం యోగి ఫొటోలను మార్ఫింగ్ చేసి..
Published Fri, Apr 7 2017 11:56 AM | Last Updated on Mon, Aug 27 2018 3:32 PM
Advertisement
Advertisement