up chief minister
-
యోగి, ఆర్ఎస్ఎస్ పేరు చెప్పమని ఏటీఎస్ బెదిరించింది
ముంబై: పేలుడు కేసులో నలుగురు ఆర్ఎస్ఎస్ నేతలు, యూపీ సీఎం ఆదిత్యనాథ్ పేర్లను చెప్పమని ముంబై ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) తనను బెదిరించిందని 2008 మాలేగాం పేలుడు కేసులో సాక్షి మంగళవారం కోర్టుకు చెప్పారు. నాడు ఆ కేసును ప్రస్తుతం పలు కేసులు ఎదుర్కొంటున్న పరమ్‌బీర్ సింగ్ పర్యవేక్షించారు. నాడు సదరు సాక్షి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అయితే హఠాత్తుగా తనను బెదిరించి పేర్లు చెప్పించారని సాక్షి కోర్టుకు చెప్పడం కలకలం రేపింది. కేసుపై ఎన్ఐఏ కోర్టు విచారణ జరుపుతోంది. పరమ్‌బీర్ సహా మరో అధికారి యోగి, ఆర్ఎస్ఎస్ నేతల పేర్లను చెప్పమని బెదిరించారని తాజా విచారణలో సాక్షి కోర్టుకు విన్నవించారు. తనను ఏటీఎస్ హింసిందన్నారు. దీంతో సాక్షి ఏటీఎస్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ను అంగీకరించమని కోర్టు ప్రకటించింది. ఇంతవరకు ఈ కేసులో 220 సాక్షులను విచారించారు. వీరిలో 15మంది అడ్డం తిరిగారు. ఈ నేపథ్యంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు మన్మోహన్, సోనియా గాంధీ, రాహుల్, సల్మాన్‌ఖుర్షిద్, ప్రియాంక క్షమాపణలు చెప్పాలని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో రాజకీయ కుట్రతో ఈ కేసును రిజిస్టర్ చేశారన్నారు. కాంగ్రెస్ కుట్రలను తనను బెదిరించారన్న సాక్షి స్టేట్మెంట్ బహిర్గతం చేసిందన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇతర ప్రతిపక్షాలు సైతం కాంగ్రెస్‌కు వత్తాసు పలికాయని విమర్శించారు. -
భగీరథుడిలా వచ్చాడు..
లక్నో : గంగా నది ప్రక్షాళన కోసం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు భగరథుడిగా వచ్చారని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. బలియా నుంచి ప్రారంభమైన గంగాయాత్ర మిర్జాపూర్ చేరుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఒకప్పుడు అయోధ్య రాజు భగీరథుడు స్వర్గం నుంచి గంగను హిమాలయాల మీదుగా గంగాసాగర్‌కు తీసుకువచ్చారని, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఆధునిక భగీరథుడిగా తన శక్తియుక్తులన్నింటినీ కూడగట్టుకుని గంగా నదీ ప్రక్షాళనకు పూనుకున్నారని కొనియాడారు. గంగా నది ఎండిపోయి ఈ ప్రాంతం ఎడారిలా మారకమునుపే ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు వచ్చారని చెప్పుకొచ్చారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన బుందేల్‌ఖండ్, వింధ్య ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా మిర్జాపూర్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. -
హిందువులకూ బీజేపీ టోకరా..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్‌లో టెకీ హత్యపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ హిందువుల ప్రయోజనాలను సైతం విస్మరిస్తోందని దుయ్యబట్టారు. ఓట్ల కోసం హిందువులను హతమార్చేందుకైనా బీజేపీ వెనుకాడదని మండిపడ్డారు. లక్నోలో చెకింగ్ కోసం కారు ఆపనందుకు ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి వివేక్ తివారీని పోలీస్ కానిస్టేబుల్ కాల్చిచంపిన సంగతితెలిసిందే. కాగా బాధితుడి భార్యతో తాను ఫోన్లో మాట్లాడానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై యూపీలో యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌పై కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. వివేక్ తివారీ హిందువైనా ఆయనను ఎందుకు చంపారు..? హిందూ బాలికలపై బీజేపీ నేతలు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అధికారం కోసం హిందువులను చంపేందుకైనా బీజేపీ నేతలు వెనుకాడరని కేజ్రీవాల్ వరుస ట్వీట్లలో కాషాయపార్టీని దుయ్యబట్టారు. -
యోగి కాన్వాయ్‌లో వాహనం 'పోయింది'!
ఉత్తరప్రదేశ్‌లో గంటకు మూడు వాహనాలు చోరీకి గురవుతాయి. అయితే ఈసారి చోరీ అయింది మాత్రం ఆషామాషీ కారు కాదు.. స్వయానా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌లోని వాహనం. ఝాన్సీ సర్క్యూట్ హౌస్‌లో పార్కింగ్ చేసిన ఆ వాహనం పోయిందని డ్రైవర్ ఫిర్యాదు చేయగానే జిల్లా పోలీసులు ఒక్కసారిగా హడలిపోయారు. రాష్ట్రంలో నేరాలను గణనీయంగా తగ్గిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఉపయోగించే కాన్వాయ్‌లోని కారే పోయిందంటే ఇక ఎలా సమాధానం చెప్పుకోవాలా అని సతమతమయ్యారు. లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రంలో ఆయన అక్కడి అధికారులతో సమావేశంలో ఉన్నారు. వాహనాలన్నింటినీ పక్కనే ఉన్న సర్క్యూట్ హౌస్ ప్రాంగణంలో పార్క్ చేశారు. సమావేశం జరుగుతోందని డ్రైవర్లు కాసేపు బయటకు వెళ్లి వచ్చారు. అలా వెళ్లొచ్చి చూసుకుంటే తన కారు కనపడలేదు. దాంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం చెక్‌పోస్టులన్నింటినీ అలర్ట్ చేశారు. ఎక్కడైనా వాహనాలను వదిలిపెట్టారేమో తనిఖీ చేశారు. అయితే ఎవరూ అనుకోని చోట ఆ కారు దొరికింది. ఎక్కడో తెలుసా.. ట్రాఫిక్ పోలీసుల దగ్గర!! అవును, ఆ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ చేసి తీసుకెళ్లిపోయారు. దాన్ని రాంగ్ ప్లేసులో పార్కింగ్ చేయడం వల్లే టోయింగ్ చేసి పార్కింగ్ కోసం కేటాయించిన ప్రాంతంలో పెట్టారు. -
సీఎం యోగి ఫొటోలను మార్ఫింగ్ చేసి..
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన లోని నగర పాలిక కౌన్సిలర్ రామ్‌కుమార్ చౌహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత మరో వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. గుర్తు తెలియని వ్యక్తి అర్జున్ అర్జున్ కుమార్ అనే పేరు మీదున్న ఫేస్బుక్ ఎకౌంట్లో ఓ మోడల్‌తో యోగి ఉన్నట్టుగా మార్ఫింగ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేశాడు. ఘజియాబాద్‌కు చెందిన ముఖేష్ మిట్టల్ అనే వ్యక్తి ఈ ఫొటోలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 'సోషల్ మీడియాలో యోగి మార్ఫింగ్ ఫొటోలను పోస్ట్ చేయడంపై ఫిర్యాదు చేయగా పోలీసు స్టేషన్ ఇంఛార్జి ఆఫీసర్ కేసు నమోదు చేసేందుకు సందేహించారు. ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం కావడంతో సీనియర్ అధికారులను కలవాల్సిందిగా సూచించారు. ఘజియాబాద్ సీనియర్ ఎస్పీ దీపక్ కుమార్‌ను కలసి విషయం చెప్పగా, ఆయన వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు' అని మిట్టల్ చెప్పారు. దర్యాప్తు చేసి, నిందితుడిని గుర్తించాల్సిందిగా క్రైం బ్రాంచ్ అధికారులను దీపక్ కుమార్ ఆదేశించారు. గత మార్చిలో గ్రేటర్ నోయిడాలో రహత్ ఖాన్ అనే యువకుడిని యోగిపై అభ్యంతకర పోస్ట్ చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. -
త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం
-
త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం
ఎన్నికల్లో తమకు తగిలిన షాక్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఇంకా కోలుకున్నట్లు లేదు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నుకుంటామని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మరీ ఎన్నికల్లో పోరాడినా బీజేపీ చేతిలో చావుదెబ్బ తినడానికి ప్రధాన కారణం యాదవ్ కుటుంబంలో చెలరేగిన అంతర్యుద్ధమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి గతంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవిని లాగేసుకున్న అఖిలేష్.. ఆ తర్వాత మాత్రం మళ్లీ వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. బాబాయ్ శివపాల్ యాదవ్‌కు, మరదలు అపర్ణా యాదవ్‌కు టికెట్ ఇచ్చి తండ్రిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. వాళ్లిద్దరిలో అపర్ణ ఓడిపోగా.. శివపాల్ గెలిచారు. అప్పట్లో ఎంతో ఉత్సాహంగా జాతీయాధ్యక్ష పదవి చేపట్టిన అఖిలేష్.. ఇప్పుడు దాన్ని ఎవరికిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్.. త్వరలోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద అఖిలేష్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అధికార నివాసం అయిన 5 కాళిదాస్ మార్గ్‌ను శుద్ధి చేస్తారని వార్తలు రావడంతో.. తాము మళ్లీ 2022 సంవత్సరంలో అధికారం చేపట్టినప్పుడు అగ్నిమాపక యంత్రాల సాయంతో గంగాజలం చల్లుతామని, అప్పుడు కేవలం 5 కాళిదాస్ మార్గ్‌లోనే కాక.. మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చల్లుతామని అన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని, అయితే వాటిని మీడియాలో చూపించడం లేదని చెప్పారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తనమీద బురద చల్లేవారన్నారు. -
నిమిషాల్లో స్పందించిన సీఎం యోగి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్.. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పినట్టుగానే యోగి దూకుడు కనబరుస్తున్నారు. కొందరు దుండగులు తమ ఇంట్లోకి చొరబడి మహిళలను లైంగికంగా వేధించారని, తమ కుటుంబానికి రక్షణ కల్పించి, నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు యోగి వెంటనే స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. హోలీ రోజున కల్యాణ్‌పూర్ ప్రాంతంలో స్థానిక యువకులు కొందరు ఓ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి తల్లీకూతుళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన ఇంటి యజమానిపై దాడి చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కల్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు కేసు విచారణలో అలసత్వం చూపుతున్నారని, తమకు సాయం చేయాల్సిందిగా బాధితుడు.. ముఖ్యమంత్రి కార్యాలయానికి, డీజీపీకి ట్వీట్ చేశాడు. దీనికి సీఎం వెంటనే స్పందించారు. యోగి ఆదేశాల మేరకు లక్నోలోని డీజీపీ ఆఫీసు నుంచి ఎస్పీ సచీంద్ర పటేల్‌కు ఫోన్ వచ్చింది. ఈ కేసును విచారించి వెంటనే నివేదిక సమర్పించాల్సిందిగా ఆయన్ను ఆదేశించారు. తాను వ్యక్తిగతంగా బాధిత కుటుంబాన్ని కలసి విచారిస్తానని, వారికి వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్టు పటేల్ చెప్పారు. తొలుత నమోదు చేసిన కేసులో కొన్ని మార్పులు చేశామని తెలిపారు. బాధిత కుటుంబానికి రక్షణ ఏర్పాటు చేశామని, నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
అతి పెద్ద రాష్ట్రానికి సీఎం.. ఆ అదృష్టవంతుడెవరో?
జనాభా పరంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం.. ఉత్తరప్రదేశ్. అక్కడ బీజేపీ అత్యంత భారీ విజయాన్ని సాధించింది. 403 మంది సభ్యులన్న అసెంబ్లీలో బీజేపీ, మిత్రపక్షాల వాళ్లే 324 మంది ఉంటారు. అంత పెద్ద రాష్ట్రాన్ని పాలించే అవకాశం రావడమంటే.. ఒక రకంగా అదృష్టమే. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో రెండు రోజుల్లో తేలిపోతుంది. యూపీ రాజధాని లక్నోలో శనివారం జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆ అదృష్టవంతుడిని ఎంపిక చేస్తారు. మొత్తం 324 మంది ఎమ్మెల్యేలు ఆరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశమవుతారు. పార్టీ సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు, భూపేంద్ర యాదవ్ ప్రత్యేక పరిశీలకులుగా ఆ సమావేశానికి వెళ్తారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, టెలికం మంత్రి మనోజ్ సిన్హా, లక్నో మేయర్ దినేష్ శర్మ.. ఇలా పలుపేర్లు ఈ రేసులో వినిపిస్తున్నాయి. కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతలను పార్టీ అధిష్ఠానం పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, యూపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్యలకు అప్పగించింది. దాంతో మౌర్య ఈ రేసు నుంచి తప్పుకొన్నట్లయింది. 'నన్ను నేనే ఎంపిక చేసుకోలేను కదా' అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అమిత్ షా కూడా.. 'కేశవ్ ఎవరి పేరు నిర్ణయిస్తే ఆ పేరు మీద ముద్ర కొట్టేస్తా' అని చెప్పారు. గతంలో కూడా యూపీ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో రాజ్‌నాథ్ సింగ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. -
సీఎం సన్నిహితుడిపై ఆరేళ్ల వేటు
ఉత్తరప్రదేశ్‌లో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయనగా.. అధికార పార్టీలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఒకవైపు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తూనే.. మరోవైపు అఖిలేష్ సన్నిహిత సహచరుడిపై పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేశారు. రాష్ట్రంలో పట్టాలుతప్పిన ఆర్థిక వ్యవస్థను అఖిలేష్ ప్రభుత్వం గాడిలో పెట్టిందని, దాంతోపాటు అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కారని ఆయన అన్నారు. తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం పెద్ద విజయమని ఆయన చెప్పారు. అయితే.. ఇలా అంటూనే మరోవైపు అఖిలేష్ యాదవ్‌కు సన్నిహిత సహచరుడైన ఎమ్మెల్సీ యుద్ధవీర్సింగ్ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన అఖిలేష్ యాదవ్ మీద చేతబడి చేయిస్తోందంటూ లేఖరాసి సంచలనం సృష్టించింది కూడా ఈ యుద్ధవీర్ సింగే. యూపీలో శాంతిభద్రతలు సరిగా లేవని గొడవ పెట్టేవాళ్లు ఒక్కసారి జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కలు చూడాలని.. దేశంలోని 26 రాష్ట్రాల కంటే యూపీ మెరుగ్గా ఉందని ములాయం చెప్పారు. వీటన్నింటి గురించి ఆయన మాట్లాడారు గానీ, మూడో తేదీ నుంచి ముఖ్యమంత్రి ప్రారంభిస్తానన్న రథయాత్ర గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. ఇక కుటుంబంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో.. అఖిలేష్ యాదవ్ సన్నిహిత సహచరుడైన యుద్ధవీర్సింగ్పై ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు పడింది. అఖిలేష్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయాలంటూ యుద్ధవీర్‌సింగ్ ములాయంకు లేఖ రాశారు. దానికి ముందు.. నేతాజీ (ములాయం)కు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నాయకుడు బేణీ ప్రసాద్ వర్మ అన్నారు. మరోవైపు.. ముఖ్యమంత్రి ఏదైనా సమావేశానికి పిలిస్తే తాను వెళ్తానని ములాయం సోదరుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ చెప్పారు. ముఖ్యమంత్రి రథయాత్రలో కూడా తాను పాల్గొంటానని ఆయన తెలిపారు. -
ముఖ్యమంత్రి రథయాత్ర వాయిదా
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాను తలపెట్టిన సమాజ్‌వాదీ వికాస్ రథయాత్రను వాయిదా వేసుకున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి తలపెట్టిన ఈ యాత్రను మళ్లీ ఎప్పటి నుంచి ప్రారంభిచేదీ మళ్లీ ప్రకటిస్తామని చెప్పారు. అక్టోబర్ 4వ తేదీన కాన్పూర్‌లో మెట్రోరైలు పనులకు శంకుస్థాపన చేస్తానని, యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభించేదీ ఆ తర్వాత నిర్ణయిస్తామని అన్నారు. ఏ దిశ నుంచి యాత్రను ప్రారంభించాలన్న విషయాన్ని కూడా ఇంకా నిర్ణయించుకోవాల్సి ఉందని అఖిలేష్ యాదవ్ చెప్పారు. 'అభివృద్ధి నుంచి విజయం దిశగా' అనే నినాదంతో అక్టోబర్ 3వ తేదీ నుంచి సమాజ్‌వాదీ వికాస్ రథయాత్రను ప్రారంభిస్తానని అఖిలేష్ యాదవ్ సెప్టెంబర్ 14వ తేదీన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆ ట్వీట్లో ఆయన ఓ బస్సులో కూర్చున్న ఫొటోను కూడా ఉంచారు. 3 अक्टूबर से, समाजवादी विकास रथ-यात्रा, विकास से विजय की ओर pic.twitter.com/Pq5GFu7EbM — Akhilesh Yadav (@yadavakhilesh) 14 September 2016 -
యూపీ సీఎం మరో కీలక నిర్ణయం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇద్దరు కేబినెట్ మంత్రులను తొలగించిన మరుసటి రోజే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్‌ను తప్పించి, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ భట్నాగర్ను ఈ పదవిలో నియమించారు. అఖిలేష్ తాజా నిర్ణయం బాబాయ్, సీనియర్ కేబినెట్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్‌కు చేదువార్త. ఎందుకంటే శివపాల్‌కు దీపక్ సంఘాల్ చాలా సన్నిహితుడు. అఖిలేష్ తండ్రి, శివపాల్ సోదరుడు, ఎస్పీ చీఫ్ ములయాం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీపక్ కీలక బాధ్యతలు చేపట్టారు. చాలాకాలంగా ఆయన శివపాల్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. రెండు నెలల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దీపక్‌పై అఖిలేష్ వేటువేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇటీవల ఖ్వామి ఏక్తాదళ్‌ను ఎస్పీలో విలీనం చేసుకునే విషయంలో బాబాయ్ శివపాల్‌తో అఖిలేష్ విభేదించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడినా.. ములయాం జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా అఖిలేష్ తాజా నిర్ణయం శివపాల్‌కు అసంతృప్తి కలిగించేదేనని ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. -
సీఎం సైకిల్ తొక్కారు.. మరి మీరో!
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీద వెళ్తే ఎలా ఉంటుంది? భద్రతా పరమైన కారణాలతో పాటు.. అసలు సీఎం లాంటి వ్యక్తి అలా వెళ్తుంటే జనం ఫాలోయింగ్ ఎలా ఉంటుందన్న విషయం కూడా చూడాలి కదా. కానీ వీటన్నింటినీ తోసిరాజని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సైకిల్ తొక్కుకుంటూ లక్నో వీధుల్లో సందడి చేశారు. అది కూడా వెనకాల పెద్ద భద్రతా ఏర్పాట్లు ఏమీ లేకుండానే. శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు తొక్కినట్లే ఓ అత్యాధునిక సైకిల్ తీసుకుని ఆయన తొక్కుకుంటూ వెళ్లిపోయారు. మధ్యలో ఎవరో ఫొటోగ్రాఫర్ కనిపిస్తే ఫొటోకు పోజులు కూడా ఇచ్చారు. ఆరోగ్యం కోసం ఇలా సైకిల్ తొక్కడం మంచిదే. మరి సీఎం తొక్కినప్పుడు మనం ఎందుకు మొహమాట పడటం? మీరూ సైకిళ్లు తీయండి!!