లక్నో : గంగా నది ప్రక్షాళన కోసం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు భగరథుడిగా వచ్చారని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. బలియా నుంచి ప్రారంభమైన గంగాయాత్ర మిర్జాపూర్ చేరుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఒకప్పుడు అయోధ్య రాజు భగీరథుడు స్వర్గం నుంచి గంగను హిమాలయాల మీదుగా గంగాసాగర్‌కు తీసుకువచ్చారని, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఆధునిక భగీరథుడిగా తన శక్తియుక్తులన్నింటినీ కూడగట్టుకుని గంగా నదీ ప్రక్షాళనకు పూనుకున్నారని కొనియాడారు. గంగా నది ఎండిపోయి ఈ ప్రాంతం ఎడారిలా మారకమునుపే ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు వచ్చారని చెప్పుకొచ్చారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన బుందేల్‌ఖండ్, వింధ్య ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా మిర్జాపూర్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment