సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్‌లో టెకీ హత్యపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ హిందువుల ప్రయోజనాలను సైతం విస్మరిస్తోందని దుయ్యబట్టారు. ఓట్ల కోసం హిందువులను హతమార్చేందుకైనా బీజేపీ వెనుకాడదని మండిపడ్డారు. లక్నోలో చెకింగ్ కోసం కారు ఆపనందుకు ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి వివేక్ తివారీని పోలీస్ కానిస్టేబుల్ కాల్చిచంపిన సంగతితెలిసిందే.
కాగా బాధితుడి భార్యతో తాను ఫోన్‌లో మాట్లాడానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై యూపీలో యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌పై కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. వివేక్ తివారీ హిందువైనా ఆయనను ఎందుకు చంపారు..? హిందూ బాలికలపై బీజేపీ నేతలు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అధికారం కోసం హిందువులను చంపేందుకైనా బీజేపీ నేతలు వెనుకాడరని కేజ్రీవాల్ వరుస ట్వీట్లలో కాషాయపార్టీని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment