టీఎస్‌పీఎస్సీకి మరో ఆరుగురు సభ్యులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సభ్యులుగా మరో ఆరుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేర కు టి.వివేక్, డి.కృష్ణారెడ్డి, డాక్టర్ కె.రామ్మోహన్‌రెడ్డి, మంగారి రాజేందర్, సీహెచ్ విద్యాసాగర్‌రావు, ప్రొఫెసర్ సీహెచ్ సాయిలు తదితరులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివా రం ఉత్తర్వులు జారీ చేశారు. 62 ఏళ్ల వయసు వరకు లేదా గరిష్టంగా ఆరే ళ్ల పాటు వారు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు పి.విఠల్, డాక్టర్ చంద్రావతి, మతీ నుద్దీన్ ఖాద్రీ సభ్యులుగా ఉన్నారు. తాజాగా ఈ ఆరుగురిని సభ్యులుగా నియమించారు.
కొత్త సభ్యుల వివరాలు
పేరు: తడకమళ్ల వివేక్
స్వస్థలం: దాచారం, నేరేడుచర్ల, నల్లగొండ జిల్లా
విద్యాభ్యాసం: ఎంఏ(జియోగ్రఫీ), బీసీజే, డిప్లొమా (ఫ్రెంచ్), ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజాల్వేషన్ అంశంపై ‘నల్సార్’ నుంచి డిప్లొమా
ఉద్యోగం: వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ అదనపు కమిషనర్ (1983లో గ్రూప్-1 టాపర్)
పేరు: మంగారి రాజేందర్ (జింబో)
స్వస్థలం: వేములవాడ, కరీంనగర్ జిల్లా
విద్యాభ్యాసం: బీఎస్సీ, ఎల్‌ఎల్‌ఎం
ఉద్యోగం: 1989లో జిల్లా మున్సిఫ్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జ్యుడీషియల్ అకాడమీ డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా తెలుగులో తీర్పు వెలువరించారు. ఎన్నో సంక్లిష్టమైన చట్టాలను తెలుగులోకి అనువదించి సామాన్యులకు చేరువ చేశారు. న్యాయపరమైన అంశాలను విశ్లేషిస్తూ యాభైకిపైగా పుస్తకాలు రాశారు. న్యాయపరమైన అంశాలపై ఆయన పత్రికలకు వ్యాసాలు రాస్తుంటారు.
పేరు: సీహెచ్ విద్యాసాగర్‌రావు
స్వస్థలం: గూడెం, ముస్తాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా
విద్యాభ్యాసం: బీఎస్సీ, ఎల్‌ఎల్‌ఎం
ఉద్యోగం: ప్రాసిక్యూషన్స్ రిటైర్డ్ డెరైక్టర్ (న్యాయ శాఖ)
పేరు: డి.కృష్ణారెడ్డి
స్వస్థలం: జలాల్‌పూర్, బాల్కొండ,
నిజామాబాద్
విద్యాభ్యాసం: ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం
ఉద్యోగం: సహకార శాఖలో జాయింట్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ప్రస్తుతం సహకార ట్రిబ్యునల్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
పేరు: ప్రొఫెసర్ చింత సాయిలు
స్వస్థలం: శ్రీమన్నారాయణపూర్, రఘునాథ్‌పల్లి, వరంగల్ జిల్లా
విద్యాభ్యాసం: ఎంటెక్, పీహెచ్‌డీ (కెమికల్ ఇంజనీరింగ్)
ఉద్యోగం: 24 ఏళ్లుగా అధ్యాపకుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఉస్మానియా టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. గతంలో వరంగల్ ఎన్‌ఐటీ, జేఎన్టీయూల్లో పనిచేశారు.
పేరు: కూర రామ్మోహన్‌రెడ్డి
స్వస్థలం: గోనెపల్లి, చిన్నకూరు, మెదక్ జిల్లా
విద్యాభ్యాసం: ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ (ఐసీటీ నుంచి)
ఉద్యోగం: 1998లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా ఉద్యోగంలో చేరారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి నిర్వహిస్తున్నారు.