సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఐసెట్)కు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుల స్వీ కరణకు దాదాపు నెలరోజులు గడు వు ఇవ్వనున్నారు. గురువారం ఉన్నత విద్యామండలి కార్యాల యంలో ఏపీ ఐసెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐసెట్ షెడ్యూల్‌ను కమిటీ ఖరారు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి, వైస్‌చైర్మన్లు ప్రొఫెసర్ విజయప్రకాశ్, ప్రొఫెసర్ నరసింహారావు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి, ఐసెట్ కమిటీ చైర్మన్, ఏయూ వీసీ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్ రాజు, కన్వీనర్ ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ వరదరాజన్, క్యాంప్ ఆఫీస్ ఇన్‌చార్జి కె.రఘునాథ్‌లు పాల్గొన్నారు.
3న ఏపీ ఐసెట్ నోటిఫికేషన్
Published Fri, Jan 29 2016 4:20 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement
Advertisement