నేడు ‘మినీ మూన్’
కోల్‌కతా: పౌర్ణమి సందర్భంగా శుక్రవారం కనిపించే చంద్రుడు మామూలు పరిమాణం కన్నా చిన్నగా కనిపిస్తాడని కోల్‌కతాలోని బిర్లా ప్లానెటోరియం డెరైక్టర్ దేవీ ప్రసాద్ దురై తెలిపారు. 15 ఏళ్లకోసారి మాత్రమే కనిపించే ఈ పరిణామాన్ని ‘మినీ మూన్’గా పిలుస్తారు. సాధారణంగా భూమికి 3,84,000 కి.మీ. దూరంలో చంద్రుడు పరిభ్రమిస్తూ ఉంటాడు. కానీ శుక్రవారం ఈ దూరం 4,06,350 కి.మీ.కు చేరటం వల్ల చిన్నగా కనబడుతుందని దురై తెలిపారు. రాత్రి పాక్షికంగా చిన్న చంద్రుడిని గుర్తించవచ్చన్నారు.