బెంగళూరు : బెంగళూరులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనకు సంబంధించి విబ్జియర్ పాఠశాల స్కూల్ చైర్మన్ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అత్యాచారానికి సంబంధించి ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నించారంటూ రోస్టమ్ కేరవాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన స్కూల్ చైర్మన్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషన్ ఎం.ఎన్. రెడ్డి తెలిపారు.
విద్యార్థిని జులై 2న అత్యాచార ఘటన జరిగినప్పటికీ స్కూలు యాజమాన్యం ఆ విషయం బయటికి పొక్కకుండా దాచిపెట్టింది. ఈనెల 9వ తేదీన బాలిక తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. ఇక బాలికపై అత్యాచారం జరిపిన ఇద్దరు పాఠశాల సిబ్బందిని వర్థూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనపై బెంగళూరు నగరం ఆందోళనలు, నిరసనలతో అట్టుడికింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే.
అత్యాచార ఘటనలో స్కూల్ చైర్మన్ అరెస్ట్
Published Wed, Jul 23 2014 12:34 PM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM
Advertisement
Advertisement