బెంగళూరు బాలికపై రేప్: మరో ఇద్దరి అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని కేంబ్రిడ్జి స్కూల్లో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరానగర్ కేంబ్రిడ్జి స్కూల్ డైరెక్టర్, ప్రమోద్ ఆర్య, ప్రిన్సిపాల్ విజయంతిలను అదుపులోకి తీసుకున్నట్టు అదనపు పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 188, 336 కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.
కేంబ్రిడ్జి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో హిందీ బోధనతో పాటు పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న జై శంకర్ అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగుచూసిన విష యం తెలిసిందే. జైశంకర్ను పోలీసులు అరెస్టు చేశారు.