తప్పులో కాలేసిన.. బీబీసీ!
లండన్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మృతిచెందారంటూ ప్రఖ్యాత వార్తా ప్రసార సంస్థ బీబీసీ ఉద్యోగి ఒకరు ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పుకార్లు షికార్లుచేశాయి. వెంటనే అప్రమత్తమైన బీబీసీ సంస్థ... ట్వీట్‌ను తొలగించి, క్షమాపణలు చెప్పింది. రాజకుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలన్న దానిపై బీబీసీలో అంతర్గతంగా సాధారణ అభ్యాసన జరుగుతుండగా పొరపాటున ఒక ట్వీట్ బహిర్గతమైందని వివరణ ఇచ్చింది.
బీబీసీ ఉర్దూలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అమీన్ ఖవాజా అనే మహిళా జర్నటిస్టు ఈ ట్వీట్ చేసింది. వాస్తవానికి క్వీన్ ఎలిజబెత్ వార్షిక వైద్యపరీక్షల నిమిత్తం బుధవారం లండన్‌లోని ఆస్పత్రికి వచ్చి వెళ్లారు. 89ఏళ్ల రాణి ఆరోగ్యంగానే ఉన్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు ప్రకటించారు.