ఏయూ పూర్వ విద్యార్థికి విశిష్ట గౌరవం | bendapudi neeli as Executive Vice Chancellor for The University of Kansas | Sakshi
Sakshi News home page

ఏయూ పూర్వ విద్యార్థికి విశిష్ట గౌరవం

Published Wed, Jul 6 2016 10:02 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

ఏయూ పూర్వ విద్యార్థికి విశిష్ట గౌరవం

ఏయూ పూర్వ విద్యార్థికి విశిష్ట గౌరవం

 ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంబీఏ విభాగ పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ బెండపూడి నీలి అమెరికాలోని కెన్సాస్ లారెన్స్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చాన్సలర్‌గా నియమితులయ్యారు. నీలి తల్లిదండ్రులు ఆచార్య రమేష్ దత్తా, ఆచార్య పద్మ దత్తాలు ఏయూ ఆంగ్ల విభాగంలో ఆచార్యులుగా పనిచేశారు.

నీలి భర్త కెన్సాస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. నీలి ఈ నెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆమె రిచర్డ్ డి ఇర్విన్ డాక్టరల్ డిసర్టేషన్ ఫెలోషిప్, ద ఫోర్డ్ మోటార్ కంపెనీ కాంపిటీటివ్ రీసెర్చ్ గ్రాంటులను, ఎంబీఏ అవుట్‌స్టాండింగ్ ఎలక్టివ్ ప్రొఫెసర్ తదితర ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఆమెకు ఈ పదవి దక్కడంపై ఏయూ ఆచార్యులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

పోల్

Advertisement