బ్రిటన్ కూడా ఆ కారును టెస్ట్ చేసేసిందట!
బ్రిటన్ కూడా ఆ కారును టెస్ట్ చేసేసిందట!
Published Thu, Oct 13 2016 4:35 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
లండన్ : సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలపై ఓ వైపు టెక్ దిగ్గజాలు, మరోవైపు స్థానిక ప్రభుత్వాలు పట్టుబిగ్గుస్తున్నాయి. స్థానికంగా తయారుచేసిన డ్రైవర్లెస్ వాహనాలను మొట్టమొదటిసారి బ్రిటన్ బహిరంగ ప్రదేశాల్లో విజయవంతంగా పరీక్షించింది. దక్షిణ బ్రిటన్లోని మిల్టన్ కీన్స్ పట్టణంలో ఈ వాహనాలను పరీక్షించినట్టు ఆక్స్బోటికా అనే కంపెనీ వెల్లడించింది. సాప్ట్వేర్తో నడిచే టెస్ట్ వెహికిల్ సెలీనియమ్ను ఆక్స్బోటికా కంపెనీ ఇంటిగ్రేటెడ్గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అభివృద్ధి చేశారు. కెమెరాల నుంచి లేడార్ సిస్టమ్తో తనకు తానుగా మార్గనిర్దేశం చేయబడుతూ సెలీనియం ప్రయాణించగలదని ఆక్స్బోటికా కంపెనీ తెలిపింది. మిల్టన్ కీన్స్ రైల్వే స్టేషన్లో, బిజినెస్ జిల్లాలో ఈ వాహనం విజయవంతంగా పరీక్షించామని కంపెనీ ఆనందం వ్యక్తంచేసింది.
ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ క్యాటాపుల్ట్(టీఎస్సీ) 18 నెలల కృషి అనంతరం వీటిని అమలోకి తెచ్చినట్టు కంపెనీ పేర్కొంది. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీస్ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ వాహనాలను పరీక్షిస్తున్నామని తెలిపింది. బ్రిటీష్ ప్రభుత్వ ఇన్నోవేషన్ ఏజెన్సీ, ఇన్నోవేట్ యూకే స్థాపించిన టెన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్లలో టీఎస్సీ ఒకటి. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను యూకే, ప్రపంచ రోడ్లపై పరుగులెత్తించడానికి ఇది ఓ మైలురాయి అని ఆక్స్బోటికా సీఈవో గ్రేమ్ స్మిత్ అన్నారు. భవిష్యత్తులో అర్బన్ ప్రాంతాల్లో కూడా స్థానిక ట్రాన్స్ఫోర్టేషన్కు ఈ వాహనాలను వాడేలా అభివృద్ధి చేయగలుగుతామని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
Advertisement
Advertisement