ఓ కేంద్ర మంత్రి.. ఆవకాయ!
కేంద్రంలో మంత్రి అయినా.. విదేశాలకు వెళ్లి వాణిజ్య సంబంధాలు పెంపొందించినా.. ఆమె కూడా ఓ తెలుగింటి కోడలే. అందుకే ఆవకాయ, తొక్కుడు పచ్చడి వదులుకోలేకపోయారు. అత్తవారింటికి వెళ్లి.. అక్కడ అత్తగారు, ఆడపడుచులతో కలిసి ఆవకాయ పెట్టే పనిలో పడ్డారు. ఆమె ఎవరో కాదు.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. స్వతహాగా తమిళనాడుకు చెందినా, పరకాల ప్రభాకర్ ను పెళ్లి చేసుకుని పశ్చిమగోదావరి జిల్లా కోడలయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ సతీమణి అయిన నిర్మల.. ప్రస్తుతం ఆవకాయ సీజన్ కావడంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని 'ఈశావాస్యం'లో అందరూ కలిసి ఆవకాయ, తొక్కుడు పచ్చడి, బెల్లం ఆవకాయ పెట్టుకున్నారు. ఈ విశేషాలను పరకాల ప్రభాకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పదిమందితో పంచుకున్నారు.
ఈశావాస్యమ్ లో పునరపి ఆవకాయం! The Grand Aavakaya annual ritual at #Isavaasyam Nirmala does. Akka n Amma guide. pic.twitter.com/eyD9MqjVvB
— Parakala Prabhakar (@parakala) May 2, 2015