ప్రముఖ ఆర్థిక రంగ నిపుణుడికి చైనా కీలక పదవి
ప్రముఖ ఆర్థిక రంగ నిపుణుడికి చైనా కీలక పదవి
Published Fri, Feb 24 2017 10:45 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM
ప్రముఖ ఆర్థిక రంగ నిపుణుడు గౌ షుకింగ్ కు చైనా కీలక పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. తన దేశపు బ్యాంకింగ్ రెగ్యులేటర్ అధినేతగా గౌను నియమించిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రిటైర్ కాబోతున్న షాంగ్ ఫులిన్ స్థానంలో ఆయన నియామకం జరిగిందని తెలిపాయి. అయితే ఈయన నియామకాన్ని చైనా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. చైనా బ్యాంకింగ్ రెగ్యులేటరీ కమిషన్కు గౌన్ను చైర్మన్గా, పార్టీ సెక్రటరీగా నియమిస్తున్నట్టు ఇంటర్నల్గా సీబీఆర్సీ స్టాఫ్‌కు తెలిపారని ఓ అధికారి చెప్పారు. అయితే ఈ విషయాన్ని సీబీఆర్బీ ప్రెస్ ఇంకా బయటికి వెల్లడించలేదు. గౌ, 2013లో ఉత్తర చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్కు గవర్నర్గా అపాయింట్ అయ్యారు.
దేశీయ ఆర్థిక ప్రక్రియను సంస్కరించడానికే గౌ తన ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. అంతకముందు చైనా సెక్యురిటీస్ రెగ్యులేటరీ కమిషన్కు ఆయన చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఫైనాన్సియల్ సిస్టమ్లో పలు కీలక బాధ్యతలను నిర్వర్తించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. చైనా కన్స్ట్రక్షన్ బ్యాంకు కార్పొరేషన్ కు చైర్మన్ గా, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కు అధినేతగా వ్యవహరించారు. చైనా, గ్లోబల్ కు సంబంధించిన స్థూల ఆర్థికాంశాలపై గౌకు అపారమైన అనుభవం ఉందని ఆసియా మోర్గాన్ స్టాన్లీ మాజీ చైర్మన్ స్టీఫెన్ రోచ్ చెప్పారు. షాడో బ్యాంకింగ్, చైనా బ్యాంకులకు గుదిబండలా మారుతున్న రుణాలు ఆయనకు సవాలుగా నిలవనున్నాయి.
Advertisement
Advertisement