బీజింగ్: చంద్రుడిపై పరిశోధనల కోసం ఓ రోవర్, ల్యాండర్‌తో కూడిన చాంగ్-3 వ్యోమనౌకను చైనా ఆదివారం రాత్రి విజయవంతంగా ప్రయోగించింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని జిచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ‘చాంగ్‌జేంగ్ 3బీ వై-23’ రాకెట్ ద్వారా ‘చాంగ్-3’ని విజయవంతంగా ప్రయోగించామని, వ్యోమనౌక నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుందని చైనా అధికారికవర్గాలు వెల్లడించాయి. కాగా, చైనా ఇంతకుముందు చంద్రుడి చుట్టూ తిరిగే రెండు ఉపగ్రహాలను పంపింది. రోవర్‌ను, ల్యాండర్‌ను పంపడం మాత్రం ఇదే తొలిసారి.