పారిస్‌పై ఉగ్రవాద దాడులు ఐఎస్‌కు వ్యతిరేకంగా మిలిటరీ సంకీర్ణ సేన ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని సృష్టించాయని నిపుణులు
వాషింగ్టన్: పారిస్‌పై ఉగ్రవాద దాడులు ఐఎస్‌కు వ్యతిరేకంగా మిలిటరీ సంకీర్ణ సేన ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని సృష్టించాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా దీని గురించి తక్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అయితే హింసాత్మక ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి ఇప్పటికిప్పుడే అమెరికా లేదా అంతర్జాతీయ సేన వైమానిక దాడులు చేయడం సరికాదని వారు భావిస్తున్నారు. పాతకాలంలోలాగ ఐఎస్‌ఐఎస్‌పై తిరిగి బాంబు దాడి చే యలేమని విశ్లేషకుడు ఆంథోని కార్డెస్‌మన్ అభిప్రాయపడ్డారు.
మరోపక్క.. పారిస్‌పై ఉగ్ర దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా తమ జాతీయ భత్రతామండలి(ఎన్‌ఎస్‌సీ) సిబ్బందితో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా నిఘా వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.