ఆవుదూడకు బారసాల | cow calf to celebrate his birth 'barasala' | Sakshi
Sakshi News home page

ఆవుదూడకు బారసాల

Published Mon, Aug 10 2015 6:41 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

cow calf to celebrate his birth 'barasala'

జగిత్యాల అర్బన్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని శక్తిగణేశ్ ఆలయంలో సోమవారం లేగదూడకు బారసాల నిర్వహించారు. శక్తిగణేశ్ ఆలయ పూజారి కర్నె నారాయణశర్మ ఇంట్లోని ఆవుకు ఇటీవల దూడ పుట్టింది.

పుష్కరాల సమయంలో లేగదూడ జన్మించడం మహాపుణ్యమని గోమాతకు పూజలు నిర్వహించడంతో పాటు దూడకు బారసాల నిర్వహించారు. లేగెదూడకు గోదావరి అని నామకరణం చేశారు. అనంతరం బంధుమిత్రులకు అన్నదానం చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement