ఫేస్‌బుక్‌లో ఫొటోలు వద్దు: ముస్లిం మహిళలకు మతపెద్దల సూచన
ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లలో మహిళలు తమ ఫొటోలు పోస్ట్ చేయడం ఇస్లాంకు విరుద్ధమని లక్నోకు చెందిన ప్రముఖ మతపెద్దలు ముఫ్తీ మహ్లీ, సైఫ్ అబ్బాస్ నఖ్వీ ప్రకటించారు. ప్రేమాభిమానాలను ఇంటర్నెట్‌లో కాకుండా నిజ జీవితంలో పొందాలని సూచించారు. సోషల్ వెబ్‌సైట్లలో ప్రొఫైల్స్, ఫొటోలు ఉంచవచ్చా అని తాము నడుపుతున్న హెల్ప్‌లైన్లకు వందలాది ఫోన్లు వచ్చాయని సున్నీ మత పెద్ద ముఫ్తీ చెప్పారు.
వ్యాపారం వంటి వాటి కోసం ఫేస్‌బుక్‌లో ఖాతాలు పెట్టుకోవడం తప్పేమీ కాదని, అయితే మహిళలు ఫొటోలు పోస్ట్ చేయడం సరికాదన్నారు. ‘ముస్లిం మహిళలు బురఖా వేసుకోవాలని షరియా చెబుతోంది. ఇంటర్నెట్ విషయంలోనూ దీన్ని పాటించాలి’ అని నఖ్వీ అన్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ముస్లిం మహిళలు ఎవరూ తమ ఫొటోలు పెట్టొద్దని వారు సూచించారు.