తెల్లజాతి తల్లికి నల్లజాతి బిడ్డ ...
ఒహియో : ఆసుపత్రుల్లో పిల్లల తారుమారు వార్తలు విన్నాం కానీ ... స్పెర్మ్ (వీర్యం) తారుమారైన సంఘటన ఆమెరికాలోని తెల్లజాతి మహిళలకు ఎదురైంది. అమెరికాలో ఓ మహిళ గర్భం దాల్చడానికి శ్వేతజాతి వ్యక్తి వీర్యాన్ని (స్పెర్మ్)కి బదులు నల్లజాతి వ్యక్తి స్పెర్మ్‌ను ఎక్కించడం వివాదంగా మారింది. ఈ వివాదంపై బాధిత మహిళ ఒహియో నగరానికి చెందిన జెన్నిఫర్ దాఖలు చేసిన దావాను డ్యూపేజ్ కౌంటీ కోర్టు తిరస్కరించింది.
2011 డిసెంబర్లో కృత్రిమ వీర్య దానం ద్వారా గర్భం దాల్చడానికి ఓ శ్వేతజాతి వ్యక్తిని జెన్నీఫర్ ఎంపిక చేసుకున్నది. కానీ ఇల్లినాయిస్ మిడ్‌వెస్ట్ స్పెర్మ్ బ్యాంకు (వీర్యనిధి) నిర్లక్ష్యం కారణంగా వీర్యదాత 380కి బదులు330 నంబర్ నల్లజాతీయుడి వీర్యాన్ని జెన్నిఫర్ గర్భంలోకి ఎక్కించారు.
వీర్యనిధి బ్యాంక్ సిబ్బంది చేసిన పొరపాటుకు ఫలితం తెల్ల జాతీయురాలైన జెన్నిఫర్కి నల్లజాతి లక్షణాలున్న చిన్నారికి జన్మనివ్వాల్సి వచ్చింది. బిడ్డ పుట్టిన తరువాత అసలు విషయం బయటపడింది. స్పెర్మ్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మరో తెగకు చెందిన చిన్నారికి జన్మనివ్వాల్సి వచ్చిందని ఆమె కోర్టును ఆశ్రయించింది. వైద్య ప్రమాణాల ప్రకారం పుట్టిన శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని... ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు న్యాయశాస్త్ర పరిధిలోకి రాదని డ్యూపెజ్ కోర్టు తన తీర్పులో పేర్కొంది.