న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. సమాన పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకుకూడా సమాన వేతనం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. రోజూ వారీ విధుల్లో భాగంగా ఒకే సేవలు అందించే ఉద్యోగులకు కూడా సమాన పని సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని ఆదేశించింది. అలా చెల్లించకపోవడం "బానిసలుగా దోచుకోవడం, అణచివేతకు, అక్రమం కిందకివస్తుందని వ్యాఖ్యానించింది. పంజాబ్ కు చెందిన టెంపరరీ ఉద్యోగుల దాఖలుచేసుకున్న పిటిషన్ సుప్రీం ఇలా స్పందించింది. పంజాబ్ హైకోర్టు వారికి సమానవేతనాలు చెల్లించడానికి నిరాకరించడంతో వారు సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వేతనాలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఒక పనిచేసే ఉద్యోగుల్లో ఒకరికి తక్కువ వేతనం చెల్లించడం సరికాదని ఇది మానవగౌరవాన్ని కించపరచడం కిందికి వస్తుందని జస్టిస్ ఖేహర్ , జస్టిస్ ఎస్ఏ బాబ్డేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది
1966లో భారతదేశం సంతకం చేసిన అంతర్జాతీయ లిఖిత సమ్మతి సామాజిక మరియు సాంస్కృతిక హక్కుల పత్రంలోని ఆర్టికల్ 7 ప్రకారం దీన్ని వర్తింపచేయాలన్నారు. ఏప్రిల్ 10, 1979లో ఆమోదించిన ఈ ఒప్పందానికి ఉఉదహరిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈవ్యాఖ్యలు చేసింది. ఈ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి లేదని పేర్కంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 కింద 'సమాన పనికి సమాన వేతనం' అనే సిద్ధాంతాన్ని తాత్కాలికమా, రెగ్యులరా అనే భేదం లేకుండా ప్రతీవారికి అమలు చేయాలని తీర్పు చెప్పింది.
సుప్రీం సంచలన తీర్పు
Published Sat, Oct 29 2016 8:38 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement