ఆడకుక్కలే నయం | Female dogs better at socialising with humans! | Sakshi
Sakshi News home page

ఆడకుక్కలే నయం

Published Mon, May 4 2015 3:24 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

ఆడకుక్కలే నయం

ఆడకుక్కలే నయం

మనుషులకు చేరిక కావడంలో మగ కుక్కల కంటే ఆడ కుక్కలే నయమని పరిశోధకులు చెబుతున్నారు. ఆడ కుక్కలైతే త్వరగా యజమానుల వద్దకు వచ్చి తోక ఊపుకుంటూ ఎగిరి ఒళ్లో కూర్చుంటాయని, కళ్లలో కళ్లుపెట్టి చూస్తాయని అంటున్నారు. ఈ విషయంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 430 జాతులకు చెందిన కుక్కలపై పరిశోధనలు చేశారు. కుక్కలను ఇళ్లలో పెంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత వాటిలో మార్పులు ఎలా వచ్చాయన్న అంశం మీద కూడా ఈ పరిశోధన సాగింది.

ఏ జాతిలో చూసినా కూడా మగ కుక్కల కంటే ఆడ కుక్కలే ఎక్కువగా మనుషుల వద్దకు చేరిక అవుతున్నాయని పెర్ జెన్సన్ నేతృత్వంలోని పరిశోధన బృందం వివరించింది. ఒక ట్రిక్కును ఏ కుక్క బాగా చేసిందో దానికి బిస్కట్లు ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో కుక్కలు ఎలా పోటీ పడ్డాయో రికార్డుచేసి చూశారు. అన్ని జాతుల్లోనూ ఆడ కుక్కలు మాత్రం మగవాటి కంటే ఎక్కువగా వాళ్ల వద్దకు వచ్చాయి. దాదాపు ఒకే కుటుంబానికి చెందిన కుక్కలు ఒకలాగే ప్రవర్తిస్తున్నట్లు కూడా తేలింది.

Advertisement

పోల్

Advertisement