మెగాస్టార్ చిరంజీవి 149వ సినిమా 'శంకర్ దాదా జిందాబాద్' చూశారా? 2007లో విడుదలైన ఆ సినిమాలో 'నా పేరే కాంచనమాల.. నా వయసే గరం మసాలా..' అంటూ ఐటం సాంగ్ లో నర్తించిన గౌహర్ ఖాన్ గుర్తుందా? యశ్ రాజ్ బ్యానర్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన 'రాకెట్ సింగ్' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ మరాఠీ భామకు 'చిరు సాంగ్' తర్వాత అడపాదడపా అవకాశాలు వచ్చినా అంతగా రాణించలేకపోయింది. బ్రేక్ కోసం ఎదురు చూస్తోన్న ఆమెకు ఇటీవలే 'బేగం జాన్'లో అవకాశంతో బంపర్ ఆఫర్ తగిలింది.
దేశ విభజన సమయంలో కొందరు బెంగాలీ వేశ్యల జీవితం ఇతివృత్తాంతంగా రూపొందుతోన్న 'బేగం జాన్'లో విద్యాబాలన్ లీడ్ రోల్ చేస్తోండగా, మరో వేశ్యగా గౌహర్ ఖాన్ నటిస్తోంది. జూన్ లో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ఆమెది డీ గ్లామరస్ రోల్. మేకప్ లేనిదే బయటికి అడుగుపెట్టని తాను.. వేశ్య పాత్ర కోసం ఎన్ని పాట్లు పడుతోంది చెప్పుకొచ్చింది గౌహర్. 'బేగం జాన్'లో నా క్యారెక్టర్ సహజంగా కనిపించాలి. దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ సూచన మేరకు మేకప్ వేసుకోవడం పూర్తిగా మానేసిందట. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న తాను ఇలాంటి(మేకప్ వేసుకోకుండా ఉండే) రోజులు వస్తాయని ఊహించలేదని గౌహర్ ఖాన్ చెప్పింది. 'బేగం జాన్' బెంగాలీ సినిమా 'రాజ్ కహిని'కి రీమేక్. (చదవండి: నటిపై చేయి చేసుకున్న యువకుడు)
వేశ్య పాత్ర కోసం నటి పాట్లు
Published Sat, Jul 9 2016 7:40 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM
Advertisement
Advertisement