నడిరోడ్డులో అమ్మాయిలు చితక్కొట్టారు | Girls beat up eve-teaser in Odisha | Sakshi

నడిరోడ్డులో అమ్మాయిలు చితక్కొట్టారు

Aug 29 2016 7:01 PM | Updated on Jul 11 2019 8:06 PM

నడిరోడ్డులో అమ్మాయిలు చితక్కొట్టారు - Sakshi

నడిరోడ్డులో అమ్మాయిలు చితక్కొట్టారు

ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అమ్మాయిలు ఈవ్టీజర్కు తగినశాస్తి చేశారు.

భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అమ్మాయిలు ఈవ్టీజర్కు బడితెపూజ చేశారు. అమ్మాయిలు వెదురుకర్రలతో అతణ్ని చితకబాది, మోకాలిపై నుంచోపెట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

భువనేశ్వర్లోని ఉత్కల్ యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థినిపై వినోద్ కుమార్ సాహూ అనే ఓ ప్రైవేట్ ట్యూటర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. వాణి విహార్ వద్ద ఉన్న వర్శిటీ క్యాంపస్ వుమెన్స్ హాస్టల్కు ఆమె వెళ్తుండగా బస్ స్టాప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆ విద్యార్థిని స్నేహితులను పిలవగా వెంటనే అక్కడకు వచ్చారు. ఆమె స్నేహితులకు విషయం చెప్పింది. ఇది గమనించిన సాహు అక్కడ నుంచి జారుకున్నాడు. అయితే అమ్మాయిలు అతని కోసం గాలించి వీఎస్ఎస్ నగర్ గేట్ వద్ద పట్టుకున్నారు. రోడ్డుపై అతణ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement