
గుజరాత్ లో దారుణం
అహ్మదాబాద్: గుజరాత్ లో దారుణం జరిగింది. కన్నతండ్రి ఎదుటే ఇద్దరు బాలికలపై కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భుత్ పాగ్లా గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు, వారి తండ్రిని బుధవారం దుండగులు కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులో తండ్రి ఎదుటే బాలికలపై ఆరుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత వీరిని మాందవ్ గ్రామంలో వదిలేశారు. పోలీసు కేసు పెడితే చంపేస్తామని బెదిరించారు.
స్థానికుల సహాయంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు గురువారం ఐదుగురు నిందితులు కుమత్ బారియా, గణపత్ బారియా, నర్వాత్ బారియా, సురేశ్ నాయక్, గోప్ సిన్హ్ బారియాలను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అక్రమ మద్యం కేసులో తనపై బాలికల తండ్రి కేసు పెట్టినందుకు ప్రతీకారంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కుమత్ బారియా చెప్పాడు. నిందితులపై సెక్షన్ 376(గ్యాంగ్ రేప్), పోస్కో కింద కేసులు నమోదు చేశారు.