
గుజరాత్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిపై దారుణం
రాజ్‌కోట్: గుజరాత్‌తో బంగ్లాదేశ్‌కు చెందిన 14 ఏళ్ల బాలికను కామంధులు చిత్రహింసలు పెట్టారు. వారం రోజుల పాటు బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
బాధితురాలిని బంధువులే.. పశ్చిమబెంగాల్‌లోని బొంగా గ్రామానికి చెందిన సాయి అనే ఏజెంట్‌కు అమ్మేశారు. అక్కడి నుంచి ఆ అమ్మాయిని గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాకు పంపారు. అహ్మదాబాద్‌కు తర్వాత మంగ్రోల్‌కు చేరుకుంది. అహ్మదాబాద్‌లో ఏడుగురు దుండగులు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మంగ్రోల్‌కు తీసుకెళ్లి 14 మంది నరకం చూపించారు. మంగ్రోల్ బస్ స్టేషన్ వద్ద బాధితురాలు ఏడుస్తూ ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా భాష సమస్య వల్ల సాధ్యం కాలేదు. ఆ అమ్మాయిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లగా జరిగిన దారుణం గురించి చెప్పింది.