Bangladeshi girl
-
తెలంగాణ అబ్బాయి బంగ్లాదేశ్ అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు
నిజామాబాద్ జిల్లా: వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన గుమ్మల హరీష్‌కు, బంగ్లాదేశ్‌కు చెందిన రోషి (రోషిణి) అనే అమ్మాయితో ఆదివారం వెంకటాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర ఆలయంలో వివాహం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గుమ్మల హరీష్ ఐదేళ్ల క్రితం ఉపాధికోసం జోర్డాన్ దేశానికి వెళ్లాడు. అక్కడికే ఉపాధికోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రిషి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరువురు ఇష్టపడి నాలుగేళ్ల కింద జోర్డాన్‌లోనే పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల కింద హరీష్ ఇంటికి వచ్చాడు. కోవిడ్ వల్ల తిరిగి జోర్డాన్ వెళ్లలేకపోయాడు. పాస్‌పోర్డు రెన్యూవల్ ఉండడం, కోవిడ్ పరిస్థితుల వల్ల అమ్మాయి కూడా వేల్పూర్‌కు రాలేకపోయింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో నెలరోజుల కింద రోషి వేల్పూర్‌లోని హరీష్ వద్దకు చేరింది. దీంతో తమ సమక్షంలో పెళ్లి జరిపాలని హరీష్ తల్లిదండ్రులు గుమ్మల యాదగిరి, కమల, బంధువులు నిర్ణయించారు. ఆదివారం మంచి ముహూర్తం ఉండడంతో మండలంలోని వెంకటాపూర్ వేంకటేశ్వర ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా కుటుంబీకులు, బంధుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. -
గుజరాత్లో బంగ్లాదేశ్ అమ్మాయిపై దారుణం
రాజ్‌కోట్: గుజరాత్‌తో బంగ్లాదేశ్‌కు చెందిన 14 ఏళ్ల బాలికను కామంధులు చిత్రహింసలు పెట్టారు. వారం రోజుల పాటు బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలిని బంధువులే.. పశ్చిమబెంగాల్లోని బొంగా గ్రామానికి చెందిన సాయి అనే ఏజెంట్‌కు అమ్మేశారు. అక్కడి నుంచి ఆ అమ్మాయిని గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాకు పంపారు. అహ్మదాబాద్‌కు తర్వాత మంగ్రోల్‌కు చేరుకుంది. అహ్మదాబాద్‌లో ఏడుగురు దుండగులు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మంగ్రోల్‌కు తీసుకెళ్లి 14 మంది నరకం చూపించారు. మంగ్రోల్ బస్ స్టేషన్ వద్ద బాధితురాలు ఏడుస్తూ ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా భాష సమస్య వల్ల సాధ్యం కాలేదు. ఆ అమ్మాయిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లగా జరిగిన దారుణం గురించి చెప్పింది. -
ఎన్జీవో హోంలో లైంగిక వేధింపులు
ఎన్జీవో హోంలో తనను లైంగికంగా వేధించారంటూ బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలిక ఫిర్యాదు చేసింది. దాంతో ఈ కేసు విచారణకు జిల్లా కలెక్టర్ ఎ. బాబు ఓ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటుచేశారు. దాంతోపాటు.. బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు లేఖ రాశారు. టాస్క్‌ఫోర్స్ నివేదిక అందగానే దోషులపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. లైంగిక వేదింపుల ఆరోపణపై నగర కమిషనర్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఫిర్యాదు పంపుతున్నట్లు చెప్పారు. ఓ స్వచ్ఛంద సంస్థ గత మూడు నెలలుగా ఆ బంగ్లాదేశీ బాలికను అనధికారికంగా తమ ఆధీనంలో ఉంచుకుంది. వాళ్లే తనను లైంగికంగా వేధించారని ఆ బాలిక తెలిపింది. అయితే.. ఈ వేధింపులపై పోలీసులు మాత్రం ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.