ఎన్జీవో హోంలో లైంగిక వేధింపులు | bangladeshi girl sexually harassed in ngo home | Sakshi
Sakshi News home page

ఎన్జీవో హోంలో లైంగిక వేధింపులు

Published Mon, Apr 27 2015 2:23 PM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM

ఎన్జీవో హోంలో లైంగిక వేధింపులు - Sakshi

ఎన్జీవో హోంలో లైంగిక వేధింపులు

ఎన్జీవో హోంలో తనను లైంగికంగా వేధించారంటూ బంగ్లాదేశ్కు చెందిన ఓ బాలిక ఫిర్యాదు చేసింది. దాంతో ఈ కేసు విచారణకు జిల్లా కలెక్టర్ ఎ. బాబు ఓ టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటుచేశారు. దాంతోపాటు.. బంగ్లాదేశ్ హైకమిషనర్కు లేఖ రాశారు. టాస్క్ఫోర్స్ నివేదిక అందగానే దోషులపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు.  లైంగిక వేదింపుల ఆరోపణపై నగర కమిషనర్కు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఫిర్యాదు పంపుతున్నట్లు చెప్పారు.

ఓ స్వచ్ఛంద సంస్థ గత మూడు నెలలుగా ఆ బంగ్లాదేశీ బాలికను అనధికారికంగా తమ ఆధీనంలో ఉంచుకుంది. వాళ్లే తనను లైంగికంగా వేధించారని ఆ బాలిక తెలిపింది. అయితే.. ఈ వేధింపులపై పోలీసులు మాత్రం ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement