91 ఏళ్ల బామ్మ.. 42 కిలోమీటర్ల పరుగు | harriette thompson finishes 26 mile marathon at the age of 91 | Sakshi
Sakshi News home page

91 ఏళ్ల బామ్మ.. 42 కిలోమీటర్ల పరుగు

Published Sat, Jun 7 2014 11:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

91 ఏళ్ల బామ్మ.. 42 కిలోమీటర్ల పరుగు

91 ఏళ్ల బామ్మ.. 42 కిలోమీటర్ల పరుగు

గట్టిగా నాలుగు అడుగులు వేయాలంటేనే మనకు మహాబద్ధకం. అందులోనూ అరగంట నడవాలంటే మరీ కష్టం. అలాంటిది, 91 ఏళ్ల వయసులో.. అందునా కేన్సర్ వచ్చి తగ్గిన తర్వాత 42 కిలోమీటర్లు పరుగు పెట్టడం అంటే మాటలా? దాన్ని సాధించి చూపించింది అమెరికాకు చెందిన ఓ బామ్మ. మొత్తం 7 గంటల 7 నిమిషాల 42 సెకండ్లలో ఈ దూరాన్ని అధిగమించి, ఇంత మారథాన్ను పూర్తి చేసిన రెండో బామ్మగా అమెరికా చరిత్రలో నిలిచింది. ఆమె పేరు హారియట్ థాంప్సన్. తన స్నేహితురాలు లుకేమియా లింఫోమియా సొసైటీ కోసం నిధుల సేకరణకు చేపట్టిన పరుగులో ఆ బామ్మ పాల్గొంది. 21 కిలోమీటర్ల వరకు బాగానే పరిగెత్తాను గానీ, తర్వాత చాలా కష్టంగా అనిపించిందని, చుట్టుపక్కల మోగిస్తున్న బ్యాండ్ల మీదనే దృష్టి పెట్టి.. మొత్తం దూరాన్ని ఎలాగోలా పూర్తి చేసేసింది. ఈ సందర్భంగా మొత్తం 90 వేల డాలర్లు సేకరించి సొసైటీకి ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement