marathon runner
-
ఉమెన్ పవర్ 2024: కాలాన్ని కట్టడి చేశారు
కాలం.. మరో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. జారిపోతున్న కాలపు క్షణాలను అపురూపంగా ఒడిసిపట్టుకొని ఉన్నతంగా ఎదిగినవారు కొందరు... ఉదాత్తంగా జీవనాన్ని మలుచుకున్నవారు ఇంకొందరు ఆర్థిక స్థితి గతులు ఎలా ఉన్నా వెనక్కి లాగే పరిస్థితులు ఏవైనా కాలానికి ఎదురు నిలిచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ అత్యున్నతంగా ఎదిగిన కొందరు మహిళా మణుల కృషిని ఈ ఏడాది ‘సాక్షి ఫ్యామిలీ’ ఆవిష్కరించింది. ఆ గాథలను మరోమారు గుర్తుచేసుకుందాం. ఎదనిండా స్ఫూర్తిని నింపుకుందాం.డాక్టరమ్మ క్రీడా శిక్షణనిజామాబాద్ పట్టణంలో బాలికల క్రీడానైపుణ్యాలను చూసి, వారి కోసం తన పేరుతోనే 2019లో ఫుట్‌బాల్ అకాడమినీ ఏర్పాటు చేశారు డాక్టర్ శీలం కవితారెడ్డి. ఈ అకాడమీలో 41 మంది బాలికలకు కోచ్ పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణ విద్యార్థులకు ఈ అకాడమీ లో ఉచిత వసతి, ఆహారం, దుస్తులు, వైద్యసేవలను అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన ఖర్చులన్నీ భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి జాతీయ–అంతార్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఉన్నారు.అమ్మాయిలను కాపాడుకుందాం..గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణారావు. హైదరాబాద్ వాసి అయిన ఈ సామాజిక కార్యకర్త డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్‌గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయ వేదిక ‘మకాం’ సహ వ్యవస్థాపకురాలిగానూ ఉన్నారు. నారీశక్తి పురస్కార గ్రహీత అయిన రుక్మిణీరావు ముప్పై ఏళ్లుగా ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్’ ద్వారా తెలంగాణలోని ఆరు మండలాలో 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి, అలాగే ఆడపిల్లల పెంపంకం పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి కృషి చేస్తున్నారు.అమ్మలాంటి అన్నదాత కోసంసాయి ప్రియాంక చదువుకున్నది హైదరాబాద్‌లో. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్తులో పాల్గొనే అవకాశాన్ని పొందింది. ఖమ్మంవాసి అయిన పగడాల సాయి ప్రియాంక తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. కూతురికి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. తెలంగాణలోని రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న గ్రామాలలో రైతులను కలిసి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను పరీక్షించింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్‌డి చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది. విభిన్న ఆలోచనలు గల సాయి ప్రియాంక కొత్త దారిలో ప్రయాణించడమే కాదు, తన తోటివారి స్ఫూర్తిగా నిలుస్తోంది.సవాళ్లే పట్టాలెక్కించేదిదక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్)గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారిగా కె.పద్మజ ఈ ఏడాది ఆగస్టులో నియమితులయ్యారు. 1991 ఐఆర్సిఆర్లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ఉద్యోగంలో మహిళగా ఎదుర్కొన్న వివక్షను వివరించారు. ‘సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే ఆ పని కూడా సులువు అవుతుంది’ అని తెలిపారు‘మారతాను’ అనుకుంటే మారథాన్ గెలిచినట్టే!జీవనశైలిని మార్చుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాసెస్ట్ మారథాన్ రన్నర్‌గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి. 50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్లను పూర్తి చేసి, స్టార్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్‌లో పాల్గొంటున్న కవితారెడ్డి పదేళ్ల క్రితం వరకు గృహిణిగా బాధ్యతల నిర్వహణలో ఉన్నారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం జిమ్‌లో చేరి, అటు నుంచి మారథాన్ రన్నర్‌గా దేశ విదేశాల్లో మహిళల్లో క్రీడాస్ఫూర్తిని నింపుతున్నారు.అన్నీ తానై... తానే నాన్నయివ్యవసాయం చేసే తండ్రి అనారోగ్యంతో చనిపోతే డిగ్రీ చదువుతున్న అతని చిన్న కూతురు అఖిల రైతుగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామ వాసి అఖిల ఉన్న రెండెకరల భూమిని సాగు చేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న తల్లినీ, నాయినమ్మనూ సంరక్షిస్తోంది. ΄÷లం పనులకు ట్రాక్టర్ నడుపుతూ, వ్యవసాయం చేసుకుంటూ, పోటీ పరీక్షలకు సిద్ధపడుతోంది. తండ్రిలేని లోటును తీర్చుతూ కుటుంబానికి అండగా నిలబడింది. నానమ్మ గురించి రాస్తా!పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల అమ్మాయి గురించి కథలుగా రాసి, దానిని బుక్‌గా అందరికి ముందుకు తీసుకువచ్చింది ఏడవ తరగతి చదువుతున్న అక్షయినీ రెడ్డి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలైన అక్షయినీ తాతయ్యలా ‘లా’ చేస్తాను, సమాజంలో ఉన్న గాధలను కథలుగా పరిచయం చేస్తాను, నానమ్మ గురించి రాస్తాను.. అంటూ తన భవిష్యత్తు లక్ష్యాలను మన ముందుంచింది. ఆటపాటలతో రోజులు గడిపేసే ఎంతో మంది పిల్లల మధ్య ఉంటూనే ప్రపంచంలో పేరొందిన రచయితల పుస్తకాలు చదువుతూ, క్రీడల్లో రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని రూపొందించుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చిన్నపిల్లలైనా పెద్ద కలలు కనవచ్చు అంటూ తన పుస్తకాన్ని చూపుతూ భావితరానికి చెబుతోంది.నీ ఆటే బంగారం శ్రీవల్లికరీంనగర్ వాసి శ్రీవల్లికి క్రికెట్ అంటే ఇష్టం. ఐదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే హై స్కూల్ అబ్బాయిలతో కలిసి క్రెకెట్ ఆడటానికి వెళ్లింది. అందరూ ఆమెను చూసి వెటకారం గా నవ్వారు. వారి నవ్వులకు వెనకడుగు వేయకుండా విషయం పీటీటీ సర్‌కు చెప్పింది. శ్రీవల్లి ఇష్టం చూసిన పీఈటీ రహీం శ్రీవల్లి ఉత్సాహానికి మద్దతుగా నిలిచారు. తల్లిదండ్రులూ తమ ఆమోదం తెలిపారు. హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో చేరి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. జాతీయ స్థాయి మహిళా క్రికెట్ జట్టులో తన సత్తా చాటుతోంది. చైతన్య లహరి బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్ చదువుతోంది లహరి. కరాటేలో బ్లాక్‌బెల్ట్, కిక్ బాక్సింగ్‌లో ప్రావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్‌గా సత్తా చాటింది. అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నవారికి అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసింది. నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. తోటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు ‘హోప్ హౌజ్ ఫౌండేషన్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సుల్లో పాల్గొంది. తండ్రిలాగే సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనేది లహరి లక్ష్యం.బస్తీ దొరసానిచెత్తను సేకరించే అమ్మాయి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ హోదాలో ఒక రోజు అధికారిణిగా పలు శాఖల విధులను స్వయంగా సందర్శించి, తెలుసుకుంది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని పిల్లిగుడెసెల బస్తీ వాసి అరిపిన జయలక్ష్మి. బస్తీల పిల్లల బాగు కోసం కృషి చేస్తోంది. తల్లిదండ్రులతో పాటు చేత్త సేకరణ పనిచేస్తూ, కాలేజీ చదువులు చదువుతూ, బస్తీ పిల్లలకు చదువులు చెబుతుంటుంది. కోవిడ్ సమయంలో యునిసెఫ్ నుంచి వాలెంటీర్‌గా పనిచేసింది. ఢిల్లీలో ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకుంది. గాంధీ కింగ్ స్కాలర్షిప్కి దేశం మొత్తంలో పది మంది సెలక్ట్ అయితే వారిలో జయలక్ష్మి ఒకరు. ఇందులో భాగంగా కిందటేడాది అమెరికా వెళ్లి వచ్చింది. ఇప్పుడు డిగ్రీ చేస్తూ యుపీఎస్సీ సాధించాలని కృషి చేస్తోంది.టీచర్ కొలువిచ్చిన సి‘విల్’ పవర్వనపర్తి వాసి అయిన హుమేరా బేగం తండ్రి రోజువారీ కూలీగా హైదరాబాద్‌లో ఒక మదర్సాలో పనిచేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్‌గా కొంత కాలం పనిచేసింది. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. పదవ తరగతి లో ఉండగా తండ్రి ఆరోగ్యం క్షీణించి మరణించాడు. హుమేరాకు సివిల్స్ సాధించాలన్నది కల. ఆర్థిక స్థితి లేక చదువును వదిలేయాల్సిన స్థితి. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల ‘సేవ్ ద గర్ల్ చైల్డ్’ సంస్థ దృష్టికి చేరింది. ఆ సంస్థ ఆమె చదువుకు అండగా నిలబడింది. డీఎడ్పూర్తి చేసి ఎస్జీటీ ఉర్దూ టీచర్‌గా ఎంపిక అయ్యింది. దయనీయమైన పరిస్థితుల నుంచి టీచర్‌గా ఎదిగిన హుమేరా కృషి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. -
Himaja Apparascheruvu: మల్టిపుల్ వర్క్స్‌తో సక్సెస్.. ఇంగ్లీషు ఎంత ముఖ్యమో..
కెరీర్లో విజయం సాధించిన మహిళలు కుటుంబంపై దృష్టి పెట్టలేరని చాలామంది అనుకుంటారు. అలాగే, మహిళలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నా, తమ కోసం తాము టైమ్‌ను కేటాయించుకోరు అనీ అంటుంటారు. అయితే ఈ ఊహలన్నీ తప్పని హిమజ అప్పరాశ్చెరువు రుజువు చేస్తోంది. మన శక్తి ఏంటో మనకే తెలుసు అని తన పనుల ద్వారా చూపుతోంది. అనంతపురం వాసి అయిన హిమజ అప్పరాశ్చెరువు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా, మారథా రన్నర్‌గా సత్తా చాటుతోంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా కుటుంబ బాధ్యతలతోనూ మల్టిపుల్ వర్క్స్‌తో రాణిస్తోంది. చిన్న పట్టణంలో పెరిగిన హిమజ పెద్ద కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకుంటోంది. తన కెరీర్‌తో పాటు ఇద్దరు పిల్లల బాధ్యతనూ నిర్వహిస్తోంది. దీనితోపాటు, తన స్వంత అభిరుచినీ నెరవేర్చుకుంటోంది. సున్నా నుంచి మొదలు ‘నా జీవన ప్రయాణం సున్నాతో మొదలుపెట్టి ఈ రోజు చేరుకున్న చోటికి రావడం అంత తేలిక కాలేదు. ఐఐటీ రూర్కీలో ఇంజనీరింగ్ చేశాను. కాలేజీలో చేరేసరికి నాకు ఇంగ్లీషు సరిగా రాదు, హిందీలోనూ సరిగా మాట్లాడలేను. కానీ సంకల్పంతో, నేను ప్రతి సవాల్‌ను అధిగమిస్తూ, జీవితంలో చాలా నేర్చుకుంటూ విజయం వైపు పయనిస్తూనే ఉన్నాను. రానిదంటూ లేదని.. ఇంజినీరింగ్ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబిఏ పూర్తి చేశాను. ఆస్ట్రేలియన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బిఎఎమ్ పట్టా అందుకున్నాను. 2017లో అమెజాన్ కంపెనీలో సప్లై చైన్ ఎగ్జిక్యూషన్ టీమ్ పోస్ట్‌పై సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరాను. నేటి కాలంలో విద్యార్థులైనా, పనిచేసే వృత్తి నిపుణులైనా వారికి ఇంగ్లీషు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నాకు కూడా అర్థమైంది. ఈ అవసరాన్ని స్వయంగా గ్రహించి, నేను అమెజాన్ అలెక్సాలో ఇంటరాక్టివ్ సెషన్స్ చేర్చాను. ఈ నైపుణ్యంతో ఏ వయసు వారైనా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవచ్చు. కుటుంబంపై పూర్తి శ్రద్ధ నా కెరీర్‌తో పాటు కుటుంబంపై పూర్తి శ్రద్ధ పెట్టాను. నా కెరీర్లో ముందుకు వెళుతున్న సమయంలోనే రెండుసార్లు తల్లిని అయ్యాను. ఈ సమయంలో కొత్తగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ నా భర్త ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడు. కెరీర్ మాత్రమే ముఖ్యం కాదు, నా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడమూ ముఖ్యమే. అందుకే, హోమ్‌వర్క్ చేయించడం, వారితో ఆడుకోవడం, వారిని పరీక్షలకు సిద్ధం చేయడం, వారితో సరదాగా గడపడం వంటి ప్రతి అవసరాన్ని తీరుస్తాను. సమతుల్యత అవసరం.. నా దినచర్యలో అడుగడుగునా నా భర్త సపోర్ట్ ఉంది. తన తల్లిదండ్రుల పూర్తి బాధ్యతనూ తీసుకుంటాడు. మేము మా పిల్లలను వ్యక్తిగతంగా చూసుకోవడం, వారితో సమయం గడపడం మంచిదని నమ్ముతాము. బయటి పని, ఇంటి పని ఈ రెండింటి మధ్య సమానమైన సమతుల్యతను పాటిస్తాను. నా పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడం, కొత్త పనులు చేయడం నాకు ఇష్టం. మల్టిపుల్ టాస్కింగ్ మనల్ని మరింత ఉత్సాహవంతులను చేస్తుంది. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా మారాను. ఆన్లైన్–ఆఫ్‌లైన్ క్లాసులతోనూ సేవలు అందిస్తుంటాను. మారథాన్ రన్నర్‌గానూ, నా ఇతర అభిరుచుల వైపుగా సాగుతుంటాను’ అని వివరిస్తారు ఈ మల్టీ టాలెంటెడ్ ఉమన్. (క్లిక్ చేయండి: రేణు ది గ్రేట్.. స్త్రీ హక్కుల గొంతుక) -
పుష్ప.. 66 వయసులోనూ తగ్గేదేలే..!
‘వయసు అనేది అంకె మాత్రమే’ అనడం చాలా తేలిక. వయసును సవాలు చేయడం మాత్రం కష్టం! ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుంది పుష్ప భట్. 66 సంవత్సరాల వయసులో వరల్డ్స్ హైయెస్ట్ ఆల్ట్రామారథాన్లో పాల్గొనబోతుంది... మరో రెండురోజుల్లో ‘వరల్డ్స్ హైయెస్ట్ ఆల్ట్రా మారథాన్ ఖార్దుంగ్ లా ఛాలెంజి’లో పాల్గొనబోతోంది 66 సంవత్సరాల పుష్పభట్. ముంబైకి చెందిన పుష్ప 63 సంవత్సరాల వయసులో తొలిసారిగా ఈ సాహసోపేత మారథాన్‌లో పాల్గొంది. ‘ఇలాంటి మారథాన్‌లో పాల్గొనడానికి ఉత్సాహం మాత్రమే సరిపోదు. సంకల్పబలం కూడా ఉండాలి’ అంటుంది పుష్ప. తాను పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. చదువు కొనసాగించడానికి పదిహేడేళ్ల వయసు నుంచి చిన్నాచితకా పనులు చేస్తుండేది. ‘బీఏ పూర్తి చేయగలనా?’ అనుకుంది. చేయడమే కాదు ఆ తరువాత ఎంబీయే కూడా చేసింది. ఒక కంపెనీలో సెక్రెటరీగా చేరింది. కొన్ని సంవత్సరాల తరువాత ఒక షిప్పింగ్ కంపెనీలో ఎక్కువ జీతంతో చేరింది. ఆ తరువాత... ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కోరికతో యాభై ఏళ్ల వయసులో ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో... స్టాండర్డ్ చార్టెడ్ ముంబై మారథాన్‌లో పాల్గొనడానికి సహా ఉద్యోగులు ఉత్సాహం చూపుతున్న సమయంలో తాను కూడా చూపింది. ‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అనుకుంటూ నలభైఏడు సంవత్సరాల వయసులో తొలిసారిగా మారథాన్‌లో పాల్గొంది. ‘మనవల్ల ఎక్కడవుతుంది. మహా అంటే పదిహేను నిమిషాలసేపు పరుగెత్తగలనేమో’ అనుకుంది. కష్టం అనిపించినా సరే, పట్టుదలగా పరుగెత్తి మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆ సమయంలోనే పరుగెత్తడంలో ఉన్న కష్టం ఏమిటో పుష్పభట్కు తెలిసింది. అయితే ‘మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగాను’ అనే ఉత్సాహం ఆ కష్టాన్ని వెనక్కి నెట్టేసింది. ఇక అప్పటి నుంచి ఎనిమిది ఆల్ట్రా మారథాన్స్, పదకొండు ఫుల్ మారథాన్లలో పాల్గొంది. న్యూయార్క్ మారథాన్‌లో పాల్గొనడం తనకు మరచిపోలేని అనుభవం. బ్రిడ్జీలు, జనసమూహాలను దాటుకుంటూ 4 గంటల 58 నిమిషాలు పరుగెత్తింది. ప్రయాణాలు చేయడం, ప్రయాణంలో స్ఫూర్తిదాయకమై పుస్తకాలు చదవడం, తన భావాలను కవిత్వంగా రాయడం పుష్పకు ఇష్టం. ఒకానొక సంవత్సరం ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి లడఖ్‌లోని ఖార్దుంగ్ లా పాస్‌కు వెళ్లింది. అప్పుడే ‘ఖార్దుంగ్ లా ఛాలెంజ్’పై ఆసక్తి కలిగింది. ‘ఇక్కడ శ్వాసించడానికే ఇబ్బందిగా ఉంది. అలాంటిది ఈ రఫ్ అండ్ టఫ్ మార్గంలో పరుగెత్తగలనా’ అనుకుంది. శిక్షణ తీసుకున్న తరువాత బరిలోకి దిగింది. మసక మసకగా కనిపించేదారి, జారుతున్న కాళ్లు... చాలా కష్టపడాల్సి వచ్చింది. తాను గతంలో పాల్గొన్న మారథాన్లకు, సముద్ర మట్టానికి 17,852 అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలో జరిగే మారథాన్‌కు మధ్య ఉన్న భారీ తేడాను గమనించింది. అమెరికన్ కాలేజి ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్స్ పూర్తి చేసి 65 సంవత్సరాల వయసులో ‘క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్’ అనిపించుకుంది. మరింత ఉత్సాహంతో రెండోసారి ‘ఆల్ట్రా మారథాన్ ఖార్దుంగ్ లా ఛాలెంజ్’లో పాల్గొనబోతుంది. పుష్పభట్ మరోసారి అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుందాం. సుఖంగా అనిపించే పనుల్లో కంటే, కష్టంగా అనిపించే పనుల ద్వారానే మనకు క్రమశిక్షణ అలవడుతుంది. క్రమశిక్షణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. – పుష్ప భట్ -
100 రోజుల్లో.. కశ్మీర్ టూ కన్యాకుమారికి పరుగు
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న విద్వేశం ఆగాలని, మనమంతా ఒక్కటేననే భావనలో జీవించాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓ మారథన్ రన్నర్ ‘యూనిక్ మిషన్’ పరుగును మొదలు పెట్టింది. ఢిల్లీకి చెందిన 33 ఏళ్ల సుఫియా సుఫి.. 11 రాష్ట్రాలు, 25 నగరాలు, వేలాది గ్రామాల మీదుగా 100 రోజుల్లో పరుగును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యలో గాయం మూడు రోజులపాటు ఆమెను ఇబ్బంది పెట్టినా ఆమె సంకల్పం ముందు చిన్నబోయింది. ఏప్రిల్ 25న తన పరుగును ప్రారంభించిన సుఫియా.. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో తన పరుగును పూర్తి చేసుకుని ముంబైకి చేరింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన విద్వేశం వ్యాప్తి చెందుతుంది. నా పరుగు దానికి కౌంటర్‌గా ఉంటుందని భావిస్తున్నాను. మనుష్యులంతా మానవత్వం, ఏకత్వం, శాంతి, సమానత్వంతో జీవించడమే నాకు కావాలి.’ అని తెలిపింది. ఇప్పటి వరకు తన సొంత డబ్బులనే ఈ మిషన్‌కు ఉపయోగించానని తెలిపిన ఆమె.. ప్రస్తుతం క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. లిమ్కారికార్డు హోల్డర్ అయిన సుఫియా.. 15 రోజుల్లో 720 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసుకోని ఈ ఘనతను అందుకుంది. ఫిజికల్ ఫిట్నెస్ కోసం పరుగును ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం అదే పిచ్చిగా జీవిస్తోంది. ఏయిర్ ఇండియాలో ఉద్యోగం వదిలేసి మరి పరుగెత్తుతోంది. తన ’యూనిక్ మిషన్’ మధ్యలో గాయంతో సుఫియా ఆసుపత్రిలో చేరడంతో ఆమె పరుగు 3 రోజులు ఆగింది. ‘ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ మిషన్ ఎలా పూర్తి చేస్తాననే ఆందోళన కలిగింది. నేను పరుగుత్తుతున్న రూట్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇదే నా అనారోగ్యానికి కారణం. కానీ నేను వెంటనే కోలుకుని నా పరుగును అందుకున్నాను. మరి కొద్ది రోజుల్లోనే నా మిషన్ పూర్తి చేస్తాను’ అని ధీమా వ్యక్తం చేసింది. ఇక సుఫియా తన లక్ష్యాన్ని చేరుకోవాలని మనం కూడా ఆశిస్తూ.. ఆల్‌దిబెస్ట్ చెబుదాం. -
జైశా ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి
రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ ఓపీ జైశా తాను ఎదుర్కొన్న పరిస్థితులపై చేసిన ఆరోపణలపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పందించారు. మారథాన్ రన్నర్ ఓపీ జైశా ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటుచేశారు. వారం రోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని విచారణ అధికారులకు గోయల్ సూచించారు. ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినా అథ్లెట్లు తీసుకోలేదని అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) చేసిన ప్రకటనలో వాస్తవం లేదని మారథాన్ రన్నర్ ఓపీ జైశా పేర్కొంది. రియోలో 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన తనకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని జైశా ఆరోపించింది. 'నిజమేంటో ఏఎఫ్ఐ ప్రతినిధులకు తెలుసు. నేను పోటీలో పాల్గొన్న చోట కెమెరాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీ పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు' అని జైశా స్పష్టం చేసిన నేపథ్యంలో స్పందించిన కేంద్ర మంత్రి విచారణకు ఆదేశించారు. -
'నిజం నాకు, దేవుడికే తెలుసు'
బెంగళూరు: తాము ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినా తీసుకోలేదని అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) చేసిన ప్రకటనపై మారథాన్ రన్నర్ ఓపీ జైశా స్పందించింది. ఏఎఫ్ఐ ప్రతినిధులు అసలు తనకు దగ్గరకు రాకుండా ఎనర్జీ డ్రింక్స్ ఎలా ఆఫర్ చేశారని ఆమె ప్రశ్నించింది. రియో ఒలింపిక్స్ లో 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన తనకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేదని జైశా వాపోయింది. అయితే తాము ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినా జైశా, ఆమె కోచ్ తీసుకోలేదని ఏఎఫ్ఐ తెలిపింది. దీనిపై జైశా స్పందిస్తూ... 'మాకు పానీయాలు ఇవ్వలేదు. నిజమేంటో ఏఎఫ్ఐ ప్రతినిధులకు తెలుసు. నేను పోటీలో పాల్గొన్న చోట కెమెరాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీ పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా క్రీడా జీవితంలో ఇప్పటివరకు ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వానికి లేదా ఏఎఫ్‌ఐకు వ్యతిరేకంగా నేను పోరాటం చేయలేను. కానీ నిజమేంటో దేవుడికి, నాకు తెలుసు. రియో ఒలింపిక్స్ లో నా పట్ల దారుణంగా వ్యవహరించారు. అలసట తీర్చుకోవడానికి నేను ఒప్పుకోలేదని ఇప్పటీకి ఏఎఫ్ఐ చెబుతోంద'ని జైశా వాపోయింది. -
ఇటు సింధు సంతోషం.. అటు జైశా విషాదం
-
ఫ్యామిలీతో రన్‌డి
ఆగస్టు.. మిగిలినవారికి పన్నెండు నెలల్లో మరో నెల కావచ్చు. కానీ సిటీలోని పరుగు వీరులకు మాత్రం ఇది ప్రత్యేకమైన నెల. ప్రపంచవ్యాప్తంగా మారథాన్ ఈవెంట్లు మొదలయ్యేది ఆగస్టు నుంచే. అందుకే, ఇప్పుడు పరుగు వీరులు పవర్‘ఫుల్’గా సమాయత్తమవుతున్నారు. సిటీలోనే కాదు.. దేశ విదేశాల్లో జరిగే మారథాన్లలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరి ఉత్సాహానికి నిర్వాహకుల ప్రోత్సాహం కూడా తోడవుతోంది. అందుకే.. మీరే కాదు, ఫ్యామిలీని కూడా తీసుకురండి అంటూ ఆహ్వానం పంపుతున్నారు. దీంతో చాలా ఫ్యామిలీలు కొత్త ట్రెండ్ వైపు పరుగు తీస్తున్నాయి. మేమిద్దరం.. మాకిద్దరు సిటీలో 2011లో జరిగిన మారథాన్‌లో వాలంటీరుగా సేవలందించాం. ఇదే స్ఫూర్తితో చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రాగ్ మారథాన్‌లో పిల్లలు మాయ (13), ఆదిత్య (9)తో కలసి పాల్గొని పతకాలు సాధించాం. హిమాలయాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండే సాంగ్లాలో మా పిల్లలు దాదాపు పది కిలోమీటర్ల మేర పరుగు తీశారు. అమెరికాలోని ఇండియానా పోలిస్ హాఫ్ మారథాన్లోనూ అందరం పాల్గొన్నాం. - విశ్వనాథ్, శ్రీలత పరుగులో అన్నా‘దమ్ము’లు కేవలం మూడు నెలల ప్రాక్టీసుతోనే హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నాం. తర్వాత ముంబై, పాండిచ్చేరిలోని అరోవిలే, కోయంబత్తూర్ మారథాన్లలో పాల్గొన్నాం. దేశంలో అతిపెద్ద మారథాన్‌లో దాదాపు 30 వేల మంది పాల్గొన్నారు. అక్కడ పరుగు తీసే సమయంలో ఒకే బ్రిడ్జి వస్తుంది. హైదరాబాద్‌లోనైతే ఎన్నో బ్రిడ్జిలు, కొండలు, వంపుల మధ్య పరుగు తీయాల్సి ఉంటుంది. అయితే, హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్ దీనిని సమర్థంగా నిర్వహిస్తోంది. - నవీన్, జానకీరాం గ్రీకులు, పర్షియన్ల నడుమ మారథాన్‌లో జరుగుతున్న యుద్ధంలో.. గ్రీకుసేనల విజయవార్తను చేరవేసేందుకు ఒక గ్రీకు దూత మారథాన్ నుంచి ఏథెన్స్కు పరుగు పరుగున వచ్చాడు. ‘మనం గెలిచాం’ అని చెబుతూనే అతడు ప్రాణాలు విడిచాడు. అతడి జ్ఞాపకార్థం మారథాన్ ఈవెంట్ సంప్రదాయంగా మారింది. మారథాన్ పరుగు నిర్ణీత దూరం 42.195 కి.మీ. (26 మైళ్ల 218 గజాలు). దీనిని పూర్తి చేసేందుకు కనీసం 4 గంటల నుంచి గరిష్టంగా 6.30 గంటల వ్యవధి నిర్ణయిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 500 మారథాన్లు జరుగుతున్నాయి. బోస్టన్, న్యూయార్క్, బెర్లిన్, షికాగో, లండన్, లాస్ ఏంజెలిస్ వంటి నగరాల్లో జరిగే మారథాన్లు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. మన దేశంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏటా మారథాన్లు జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ప్రపంచస్థాయిలో టాప్-10 మారథాన్లను గుర్తించి, పురస్కారాలు కూడా ఇస్తున్నాయి. ఏడేళ్ల క్రితం.. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నగరంలో ఏడేళ్ల కిందట మారథాన్లకు శ్రీకారం చుట్టింది. ‘అప్పట్లో పాల్గొన్నవారి సంఖ్య వెయ్యికి లోపే. ఈ ఏడాది మేం పదివేల మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం’ అని సిటీలోని రన్నర్స్ క్లబ్ ప్రతినిధి జై భారతి అంటున్నారు. స్వల్పకాలంలోనే భారత్‌లో రెండో అతి పెద్ద మారథాన్‌గా పేరు సంపాదించింది హైదరాబాద్. సిటీలోనే కాదు, దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడ మారథాన్ ఈవెంట్ జరిగినా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే హాబీగా మారడం విశేషం. అలాగే నిర్వాహకులు కూడా సిటీ ఫ్యామిలీలకు ప్రత్యేక ఆహ్వానాలు కూడా పంపడం సంప్రదాయం. గిన్నిస్‌బుక్’లోకి దంపతుల రన్... నా భర్త కృష్ణప్రసాద్, నేను ఇరవైకి పైగా మారథాన్లలో పాల్గొని, నగరంలోనే అత్యధిక మారథాన్లలో పాల్గొన్న ఘనత దక్కించుకున్నాం. మంచుతో నిండిన ఉత్తర ధ్రువ ప్రాంతంలో నిర్వహించిన మారథాన్లోనూ పాల్గొన్నాం. ఏడు నెలల వ్యవధిలోనే ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ మారథాన్లలో పాల్గొన్నందుకు గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకున్నాం. - చిగురుపాటి ఉమ, జూబ్లీహిల్స్ పతకాల కోసమే కాదు.. ఆరోగ్యం కోసం కూడా... రెండేళ్ల కిందట హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నాం. అదే స్ఫూర్తితో చెన్నైలో పాల్గొన్నాం. ఆ తర్వాత నాసిక్ మారథాన్‌లో సెకండ్ రన్నర్స్‌గా నిలిచాం. గోవా, ఆరోవెల్లి, ముంబై మారథాన్లలోనూ పాల్గొన్నాం. మా అమ్మాయి తాన్యా గోవాలో జరిగిన 10కే రన్లో పాల్గొంది. పతకాల కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా మారథాన్‌లో పరుగు తీస్తున్నాం. - శర్వాణి, శ్యామ్ - ఎస్.సత్యబాబు/వాంకె శ్రీనివాస్ -
91 ఏళ్ల బామ్మ.. 42 కిలోమీటర్ల పరుగు
గట్టిగా నాలుగు అడుగులు వేయాలంటేనే మనకు మహాబద్ధకం. అందులోనూ అరగంట నడవాలంటే మరీ కష్టం. అలాంటిది, 91 ఏళ్ల వయసులో.. అందునా కేన్సర్ వచ్చి తగ్గిన తర్వాత 42 కిలోమీటర్లు పరుగు పెట్టడం అంటే మాటలా? దాన్ని సాధించి చూపించింది అమెరికాకు చెందిన ఓ బామ్మ. మొత్తం 7 గంటల 7 నిమిషాల 42 సెకండ్లలో ఈ దూరాన్ని అధిగమించి, ఇంత మారథాన్‌ను పూర్తి చేసిన రెండో బామ్మగా అమెరికా చరిత్రలో నిలిచింది. ఆమె పేరు హారియట్ థాంప్సన్. తన స్నేహితురాలు లుకేమియా లింఫోమియా సొసైటీ కోసం నిధుల సేకరణకు చేపట్టిన పరుగులో ఆ బామ్మ పాల్గొంది. 21 కిలోమీటర్ల వరకు బాగానే పరిగెత్తాను గానీ, తర్వాత చాలా కష్టంగా అనిపించిందని, చుట్టుపక్కల మోగిస్తున్న బ్యాండ్ల మీదనే దృష్టి పెట్టి.. మొత్తం దూరాన్ని ఎలాగోలా పూర్తి చేసేసింది. ఈ సందర్భంగా మొత్తం 90 వేల డాలర్లు సేకరించి సొసైటీకి ఇచ్చింది. ఉదయం 6.15 గంటలకు ఆమె తన పరుగు ప్రారంభించింది. అప్పటినుంచి ఏడు గంటలకు పైగా నిర్విరామంగా పరుగు తీస్తూనే వెళ్లింది. మధ్యలో కొంతమంది ఆపేయమని చెప్పారు గానీ, ఆమె సంకల్పం మాత్రం ఆగనని చెప్పింది. ఆమె ఫినిషింగ్ లైన్ దాటగానే ముందుగా వైద్య సిబ్బంది, తర్వాత టీవీ ఛానళ్ల వాళ్లు, ఫొటోగ్రాఫర్లు గుమిగూడారు. ముందు చల్లటి నీళ్లతో స్నానం చేసి.. మంచం మీద పడుకుండిపోవాలని అనిపిస్తోంది తప్ప మరేమీ అనిపించడంలేదని హేరియట్ బామ్మ చెప్పింది. ఇంతకు ముందు 92 ఏళ్ల వయసులో గ్లేడీస్ బరిల్ అనే అమెరికన్ మహిళ 9 గంటల 53 నిమిషాల పాటు పరుగు తీసింది. ఆమె తర్వాత ఈమెదే రికార్డు. మరో విశేషం ఏమిటంటే.. 76 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆమె ఇలాంటి పరుగు మొదలేపెట్టలేదు. 1987లో ఆమెకు కేన్సర్ సోకింది. దాన్ని జయించిన తర్వాత చర్చిలో ఓ స్నేహితురాలు ఏదో ఛారిటీ సొసైటీ కోసం పరుగు తీయడం చూసి, తానెందుకు పరిగెత్తకూడదని అనుకుంది. వెంటనే లుకేమియా అండ్ లింఫోమా సొసైటీని ఎంచుకుంది. మొదటి మారథాన్‌లో పాల్గొనడానికి నాలుగు వారాల ముందు వరకు ఆమె 11 రోజుల పాటు రేడియేషన్ చికిత్స తీసుకుంది. దాని ఫలితంగా రెండు కాళ్ల మీద విపరీతంగా గాయాలయ్యాయి. వాటికి బ్యాండేజిలు కట్టుకుని మరీ ఆమె పరుగు తీసింది. ఈసారి పరిగెత్తినప్పుడు 55 ఏళ్ల కొడుకు బ్రెన్నెమన్ కూడా ఆమెతో పాటు పరిగెత్తి, ఆమెకు సాయం చేశాడు. వచ్చే సంవత్సరం నాటికి తాను బతికుంటే.. మరోసారి పరిగెడతానని ధీమాగా చెప్పింది.