నాన్నకు ప్రేమతో..! | heroin bought a 40 crore gift for ​his dad | Sakshi
Sakshi News home page

నాన్నకు ప్రేమతో..!

Published Sat, Nov 12 2016 6:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

నాన్నకు ప్రేమతో..!

నాన్నకు ప్రేమతో..!

ఇటు బాలీవుడ్‌లోనే కాదు అటు హాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది దీపికా పదుకొనే. ఆమె నటించిన తొలి హాలీవుడ్‌ సినిమా ‘ ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ముంబైలో తాను నివసించే టవర్‌లోనే ఓ ఖరీదైన ఫ్లాట్‌ను బుక్‌ చేసింది. 30వ అంతస్తులో ఉండే ఈ ఫ్లాట్‌ ధర అక్షరాలు 40 కోట్లు. ప్రస్తుతం 16 అంతస్తులో తాను ఉంటున్న 4బీహెచ్‌కే ఫ్లాట్‌ను గతంలో రూ. 16 కోట్లకు దీపిక కొనుగోలు చేసింది.
 
మరీ ఈ ఖరీదైన ఫ్లాట్‌ ఎవరి కోసమంటే.. తన జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి కోసమని చెప్తోంది దీపిక. ఆయన ఎవరో కాదు దీపిక తండ్రి, ప్రముఖ బ్యాడ్మింటన్‌ ఆటగాడు ప్రకాశ్‌ పదుకొనే. ఆయన కోసం ఈ ఖరీదైన కానుకను కొనుగోలు చేసింది. తనను చూసేందుకు ముంబైకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఈ విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉంటారట. ఎంతైనా నాన్న అంటే ఎంతో ప్రేమ కాబట్టి.. ఆయన కోసం ఈ కానుక ఇచ్చిందంటున్నారు సన్నిహితులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement