మద్యం ఆశ చూపి పది హత్యలు | Hope of Alcohol Show Ten murders | Sakshi
Sakshi News home page

మద్యం ఆశ చూపి పది హత్యలు

Published Fri, Sep 30 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

Hope of Alcohol Show Ten murders

జల్సాల కోసం హతమార్చిన కిరాతకుడు
కేకే నగర్(చెన్నై): తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో కారు డ్రైవర్ హత్య కేసులో ఓ యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేయగా నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. మద్యం ఆశ చూపించి పదిమందిని హత్య చేసినట్లు అతను వాంగ్మూలమిచ్చాడు. ఈ నెల 13న తిరువెరుంబూర్‌లోని కృష్ణసముద్రం ప్రాంతంలో మృతదేహం పూడ్చిపెట్టిన స్థితిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాన్ని వెలికితీసిన పోలీసులు.. మృతుడిని తంగదురైగా గుర్తించారు. అతని సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబర్ ద్వారా విచారణ జరపగా చప్పాని(35) ఆ సెల్‌ఫోన్ ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. అతను, తంగదురై చిన్ననాటి స్నేహితులని, దొంగతనాలకు పాల్పడేవారని తెలిసింది.

భార్య మోహనప్రియ వదలి వెళ్లిపోవడంతో విలాసాలకు డబ్బు లేక తంగదురై వద్ద చేరినట్టు చప్పాని తెలిపాడు. అతడికి మద్యం తాగిం చి చైన్, ఉంగరాలను తీసుకుని హత్య చేసి పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. మద్యానికి బానిసలైన పదిమందికి పైగా వ్యక్తులను హత్య చేసి, వారి వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకున్నట్లు తెలిపాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement