జల్సాలకు అలవాటుపడి బైకుల చోరీ
Published Thu, Mar 30 2017 7:15 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
సిద్దిపేట: వ్యసనాలకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు వ్యసనాల కోసం డబ్బుల సమకూర్చు కోవడానికి బైక్ దొంగతనాలకు పాల్పడ్డారు. సిద్దిపేట పట్టణం, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస బైక్‌ల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. బూర్గుపల్లి గ్రామానికి చెందిన దున్నపోతుల స్వామి(23), దున్నపోతుల సంతోష్(21) జల్సాలకు అలవాటుపడి కొంత కాలంగా ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కమిషనరేట్ పరిధిల్లో 22 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు పేర్కొన్నారు.
గతంలో సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలను దొంగిలించి నిర్జన ప్రదేశంలో వదిలివెళ్లితే కోర్టులో డిపాజిట్ చేసి వాహన యజమానులకు అప్పగించామన్నారు. నిందితుల నుంచి బజాజ్ పల్సర్-4, హీరో హోండా ఫ్యాషన్ ప్రో-3, హీరో హోండా ఫ్యాషన్ ప్లస్-4, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్-8, హోండాషైన్-1 చొప్పున బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు.
Advertisement
Advertisement