
పెద్దాపురం: స్థానిక బ్యాంక్ కాలనీలో సుమారు రూ.నాలుగు లక్షల విలువైన బైక్ చోరీకి గురైనట్లు ఆదివారం ఫిర్యాదు అందింది. స్థానిక ఎస్సై మౌనిక తెలిపిన వివరాల మేరకు స్థానిక నియర్స్ కింగ్ ఓపెరా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆర్‌అండ్‌బి డీఈ ఎం.నాగేశ్వరరావుకు చెందిన ఏపీ39క్యూజే 3838 నెంబరు గల బైక్ యథావిధిగానే పార్క్ చేసి ఉంచారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment